News January 24, 2025
VIRAL: విపరీతమైన చలి.. ఏనుగులకు స్వెటర్లు

చలి విపరీతంగా పెరిగిపోవడంతో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో పొగ మంచు కప్పేస్తోంది. దీంతో మూగ జీవాలు సైతం వణికిపోతున్నాయి. ఈక్రమంలో ప్రతి ఏటా మథురలోని వైల్డ్‌లైఫ్ రెస్క్యూ & రిహాబిలిటేషన్ ఆర్గనైజేషన్ రెస్క్యూ చేసిన ఏనుగులకు స్వెటర్లు వేస్తుంటుంది. బ్లాంకెట్స్ & మహిళలు నేసిన ఊలు స్వెటర్లు ధరించడంతో ఏనుగులు ఎంతో అందంగా కనిపిస్తుంటాయి.
Similar News
News October 30, 2025
నేటి ముఖ్యాంశాలు

* తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
* టీమ్‌గా పనిచేసి నష్టనివారణ చర్యలు చేపట్టాం: CM చంద్రబాబు
* తెలంగాణలోని భీమదేవరపల్లి(HNK)లో 41.2cmల వర్షపాతం
* రూ.303 కోట్ల ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలి: భట్టి
* అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఖరారు: కాంగ్రెస్ పార్టీ వర్గాలు
* TTD దేవాలయాలన్నింటిలోనూ అన్నదానం చేయాలని నిర్ణయం
News October 30, 2025
మొంథా తుఫాను.. రేపు పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్

AP: మొంథా తుఫాను నేపథ్యంలో YCP రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో రేపు ఉ.11 గంటలకు ఆ పార్టీ చీఫ్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తుఫాను తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను జిల్లా అధ్యక్షులు ఆయనకు వివరించనున్నట్లు YCP వెల్లడించింది. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై పార్టీ నాయకులకు జగన్ దిశానిర్దేశం చేస్తారని పేర్కొంది.
News October 30, 2025
‘స్పిరిట్’లో డాన్ లీ?.. కొరియన్ మీడియాలో వార్తలు!

ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ మూవీని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కొరియన్ స్టార్ డాన్ లీ నటిస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇటీవల రిలీజ్ చేసిన సౌండ్ స్టోరీలో డాన్ లీ గురించి ప్రస్తావించలేదు. దీంతో అవి పుకార్లేనని అంతా భావించారు. ఈ క్రమంలో స్పిరిట్‌లో డాన్ నటిస్తున్నారని కొరియన్ మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఆయన కనిపించే తొలి ఇండియన్ మూవీ ఇదేనంటున్నాయి.


