News January 24, 2025

భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. సీపీ కీలక వ్యాఖ్యలు

image

TG: మీర్‌పేట్‌లో భార్యను <<15227723>>దారుణంగా హత్య చేసిన ఘటన<<>> సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఇది మిస్సింగ్ కేసుగానే ఉందని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. ఇతర రాష్ట్రాల ఫోరెన్సిక్ నిపుణులతోనూ ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. కేసు టెక్నికల్ అంశాలతో ముడిపడి ఉందన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Similar News

News February 5, 2026

పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల

image

TG: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేసింది. మొత్తం రూ.3,000 కోట్ల వరకు రావాల్సి ఉండగా తొలి విడతగా రూ.259 కోట్లను రిలీజ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. మిగతా నిధులనూ వెంటనే జమ చేయాలని కేంద్రానికి మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. కాగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం ఆలస్యం కావడంతో ఈ నిధులు ఆగిపోయిన సంగతి తెలిసిందే.

News February 5, 2026

‘ఇండిగో’పై విచారణకు CCI DG ఆదేశం

image

2025 DECలో ఇండిగో విమాన సర్వీసుల రద్దుపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) DG విచారణకు ఆదేశించారు. DGCA డేటా ఇన్‌పుట్‌లను పరిశీలించి కృత్రిమ కొరత సృష్టించడానికి ఇండిగో ఇలా చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసినట్లు తేల్చారు. ఆ సమయంలో లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2 నెలల తరువాత ఇప్పుడు దర్యాప్తునకు ఆదేశించారు. ఇండిగో విధానాలపై లోతుగా దర్యాప్తు చేయనున్నారు.

News February 5, 2026

మరోసారి చంద్రబాబు, పవన్ భేటీ.. ఏం జరుగుతోంది?

image

AP: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుసగా రెండో రోజు సమావేశమయ్యారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పలువురు మంత్రులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. కల్తీ నెయ్యి అంశంపై ఎలా ముందుకెళ్లాలనే దానిపైనే ప్రధానంగా చర్చ సాగుతున్నట్లు సమాచారం. అలాగే కూటమి సమన్వయం, వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టడంపైనా సమాలోచనలు చేస్తున్నారు. అగ్రనేతల సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.