News January 24, 2025
SKZR: ఆత్మీయ భరోసా నిబంధనలు ఎత్తివేయాలి

మండలంలోని కోయవాగు గ్రామపంచాయతీలో శుక్రావరం ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. ఆత్మీయ భరోసాపై పెట్టిన నిబంధనలు ఎత్తివేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ఆనంద్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. భూమిలేని వారికి ఆత్మీయ భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేసిందన్నారు. ఉపాధి కూలీలకు మాత్రమే ఆత్మీయ భరోసా వర్తిస్తుందని తెలపడం ప్రజలను మోసం చేయడమే అని పేర్కొన్నారు.
Similar News
News November 6, 2025
అనకాపల్లి: ఈ నెల 11 నుంచి క్రీడల ఎంపిక పోటీలు

సివిల్ సర్వీసెస్ ప్రభుత్వ ఉద్యోగుల జిల్లాస్థాయి క్రీడల ఎంపిక పోటీలు ఈనెల 11 నుంచి 13 వరకు అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియం, షుగర్ ఫ్యాక్టరీ గ్రౌండ్, పరవాడ ఇండోర్ స్టేడియం, అనకాపల్లి జార్జ్ క్లబ్ వద్ద నిర్వహించనున్నారు. ఈ వివరాలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పూజారి శైలజ గురువారం వెల్లడించారు. ఈ పోటీల్లో ఎంపికైన వారు ఈనెల 19 నుంచి జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
News November 6, 2025
ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ మృతి

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్ అనునయ్ సూద్(32) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు ఇన్‌స్టాలో వెల్లడించారు. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు. నోయిడాకు చెందిన అనునయ్ దుబాయ్‌లో ట్రావెల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. 46 దేశాల్లో పర్యటించిన ఆయనకు ఇన్‌స్టాలో 14L, యూట్యూబ్‌లో 3.80L మంది ఫాలోవర్లు ఉన్నారు. 2022, 23, 24లో ఫోర్బ్స్ ఇండియా టాప్-100 డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటుదక్కించుకున్నారు.
News November 6, 2025
మెంటాడ మార్పుపై ఎటువంటి ప్రతిపాదన చేయలేదు: మంత్రి

మెంటాడ మండలాన్ని మన్యం జిల్లాలో చేర్చాలనే అంశంపై తాను ఎటువంటి ప్రతిపాదన చేయలేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. జడ్పీ సమావేశంలో జడ్పీటీసీ సన్యాసినాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి ఆందోళనలో చేపడుతున్నారన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఇతర జిల్లాల నుంచి మాత్రమే ప్రతిపాదనలు వచ్చినట్లు పేర్కొన్నారు. అనవసర ఆందోళనలు వద్దని సూచించారు.


