News January 24, 2025

RRR కేసు.. తులసిబాబుకు కస్టడీ

image

AP: రఘురామకృష్ణరాజును కస్టడీలో వేధించిన కేసులో తులసిబాబుకు కోర్టు కస్టడీ విధించింది. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం తులసిబాబు గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో అతడు A-6గా ఉన్నారు. కాగా తులసిబాబు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ప్రధాన అనుచరుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News January 25, 2025

కఠిన పరిస్థితులను ఎదుర్కోవడం ఇష్టం: శార్దూల్

image

జమ్మూకశ్మీర్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ముంబై ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం అతను మాట్లాడుతూ ‘సాధారణ పరిస్థితుల్లో ఎవరైనా రాణిస్తారు. ప్రతికూల సమయాల్లో ఎలా ఆడామనేదే ముఖ్యం. నాకు కఠిన పరిస్థితులను ఎదుర్కోవడం ఇష్టం. అలాంటి వాటిని సవాలుగా తీసుకొని ఎలా అధిగమించాలో ఆలోచిస్తా’ అని అన్నారు. శార్దూల్ రాణించడంతో ముంబై జట్టు పటిష్ఠ స్థితిలో నిలిచింది.

News January 25, 2025

నాలుగు పథకాలపై నేడు సీఎం సమీక్ష

image

TG: ప్రభుత్వం ఈ నెల 26 నుంచి అమలు చేయనున్న నాలుగు పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి నేడు సమీక్ష నిర్వహించనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీపై అధికారులతో మాట్లాడనున్నారు. లబ్ధిదారుల ఎంపికలో కొన్నిచోట్ల నెలకొన్న గందరగోళ పరిస్థితులపై చర్చించనున్నారు. అటు, రాష్ట్ర వ్యాప్తంగా 16,348 గ్రామ, వార్డు సభలు పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది.

News January 25, 2025

ప్రేక్షకుల అభిప్రాయమే నాకు ముఖ్యం: అనిల్ రావిపూడి

image

వరుస విజయాలు కట్టబెడుతూ ప్రేక్షకులు చాలా ఇచ్చారని, ప్రతిఫలంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడమే తన లక్ష్యమని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ఆడియన్స్ ఖర్చు పెట్టే ప్రతిపైసాకు న్యాయం చేస్తానన్నారు. థియేటర్లకు వచ్చే జనం, కలెక్షన్లనే సక్సెస్‌గా మాట్లాడుకుంటున్నామని చెప్పారు. క్రిటిక్స్ ఎప్పుడూ ఉంటారని, వారి మాటలతో ఒత్తిడికి లోనవ్వనని తెలిపారు. తనకు ప్రేక్షకుల అభిప్రాయమే ముఖ్యమని ఓ ఇంటర్వ్యూలో వివరించారు.