News March 18, 2024
HYDలో 4 రోజులు వర్షాలు..!

గ్రేటర్ హైదరాబాద్‌లో ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. కాప్రా 34.09 డిగ్రీలు, ఉప్పల్ 34.6, ఫలక్‌నుమా 34.8, ముషీరాబాద్ 34.7, అంబర్పేట్ 34.1, ఖైరతాబాద్ 34.3, అల్వాల్‌లో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే నేటి నుంచి 4 రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.
Similar News
News September 3, 2025
HYD: ఆరోగ్య శాఖ పని తీరుపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష

హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి దామోదర రాజనరసింహ ఆరోగ్య శాఖ పనితీరుపై ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై, ఎక్విప్మెంట్ పని తీరుపై చర్చించారు. మంత్రి మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్లకు వెంటనే రిపేర్ చేయాలని, 8 ఏళ్లు దాటిన ఎక్విప్మెంట్లను స్క్రాప్‌కు తరలించాలని ఆదేశించారు.
News September 3, 2025
HYD: KCR ఫ్యామిలీ ప్రజాసొమ్ము దోచుకుంది: మహేశ్ గౌడ్

పదేళ్లు దోచుకున్న ప్రజాసొమ్ము పంపకం విషయంలోనే KCR ఇంట్లో గొడవలు జరిగాయని TPCC చీఫ్, MLC మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈరోజు గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. ‘ఎవరి వెంటో ఉండటానికి మాకేం ఖర్మ?, రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి CM.. ప్రజలు మాతో ఉన్నారు.. మేము ప్రజలతో ఉన్నాం.. హరీశ్, సంతోష్ అవినీతిపై కవిత ఆ రోజే ఎందుకు మాట్లాడలేదు.. పంచుకున్నదంతా పంచుకుని ఇప్పుడు బయటకొచ్చి మాట్లాడితే ఎవరు నమ్ముతారు’ అని అన్నారు.
News September 3, 2025
HYD: మంచి నీళ్ల కోసం మహిళల నిరసన

మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని 16, 17వ వార్డుల్లో తాగునీరు సరఫరా కావడం లేదని ఆ బస్తీ మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల తమ పంచాయతీ మున్సిపాలిటీలో విలీనమైందని, అయితే గ్రామ పంచాయతీ హయాంలో వేసిన పైప్‌లైన్ కావడంతో వారానికి ఒకసారి చాలీచాలని బోరు నీటిని వదలడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.