News January 24, 2025
ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా తిరుపతి జిల్లా కలెక్టర్

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా జిల్లాను అవార్డులు వరించాయి. ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎంపికయ్యారు. ఉత్తమ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ ఎస్పీగా తిరుపతి జిల్లా ఎస్‌పి హర్షవర్ధన్ రాజు ఎంపికయ్యారు. వీరితో పాటుగా 122-వెంకటగిరి నియోజకవర్గ EROB సుధారాణి, ఉత్తమ EROగా తిరుపతి అర్బన్ తహశీల్దార్ భాగ్యలక్ష్మి ఎంపికయ్యారు.
Similar News
News September 19, 2025
రేపు జోగులాంబ ఆలయం మూసివేత

అలంపూర్‌లో వెలిసిన జోగులాంబ దేవి ఆలయాన్ని రేపు మధ్యాహ్నం 1:00 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఈవో దీప్తి శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుండటంతో ఆలయ శుద్ధి, పవిత్రోత్సవం నిర్వహణకు ఆలయాన్ని మూసివేస్తారని తెలిపారు. బాల బ్రహ్మేశ్వర స్వామి దర్శనం యథావిధిగా ఉంటుందన్నారు. భక్తులు మార్పును గమనించి సహకరించాలని కోరారు.
News September 19, 2025
ఆ ఒక్క టెస్టుతో రెండు జబ్బులూ గుర్తించొచ్చు..

బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణకు చేసే మామోగ్రామ్ టెస్టు ఆధారంగా మహిళల్లో గుండె జబ్బుల ముప్పును గుర్తించే ఏఐ పరికరాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఆస్ట్రేలియాలో 49వేల మందికి పైగా మహిళల మామోగ్రామ్, మరణ రికార్డులను ఉపయోగించి దీనికి శిక్షణ ఇచ్చారని ‘హార్ట్’ వైద్య పత్రికలో ప్రచురించారు. ఈ టూల్‌తో రొమ్ము క్యాన్సర్, గుండెజబ్బుల ప్రమాదాన్ని గుర్తించొచ్చని పరిశోధనలో పాల్గొన్న డాక్టర్ జెన్నిఫర్ తెలిపారు.
News September 19, 2025
దేశంలో ఉస్మానియా మెడికల్ కాలేజీకి 48వ స్థానం

ఇటీవల ప్రకటించిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్స్- 2025లో ఉస్మానియా మెడికల్ కాలేజీ 51.46 స్కోరుతో వరుసగా రెండోసారి 48వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్ కోసం దేశ వ్యాప్తంగా 223 మెడికల్ కాలేజీలు పోటీ పడ్డాయి. ఎయిమ్స్ (న్యూఢిల్లీ) 1వ ర్యాంకులో నిలవగా PGIMER (చండీగఢ్), CMC (వెల్లూర్), జిప్మర్ (పాండిచేరి) మొదటి 3 ర్యాంకుల్లో నిలిచాయి.