News January 24, 2025
వనపర్తి: రాజకీయాలకు చివరి తేదీ లేదు: ఎమ్మెల్యే

రాజకీయాల్లో కొనసాగాలనుకునే వారికి చివరి తేదీ అంటూ ఏమీ లేదని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. వనపర్తి మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా అందరం కలిసికట్టుగా వనపర్తి అభివృద్ధికి పనిచేద్దామన్నారు. అన్ని వార్డులు మనవేనని అభివృద్ధిలో వివక్ష చూపేది లేదన్నారు. కౌన్సిలర్ల పదవీకాలం ముగివస్తున్న నేపథ్యంలో అందరికీ శాలువాలు కప్పి సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
Similar News
News February 24, 2026
రాజమండ్రి కల్తీ పాల కలకలం.. ‘టీ’ అంటేనే జంకుతున్న జనం

“హే చాయ్ తాగరా భాయ్” అంటూ ఆనందంగా ‘టీ’ తాగే వారు నేడు భయపడుతున్నారు. రాజమండ్రి కల్తీ పాల ఘటన ఉమ్మడి జిల్లాను వణికిస్తోంది. లాలాచెరువు ప్రాంతంలో పాలు తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో, మనం తాగే టీ, కాఫీలు క్షేమమేనా? అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. నిత్యం చాయ్, బిస్కెట్‌కు అలవాటు పడిన జనం, కల్తీ భయంతో ఇప్పుడు ‘టీ’ తాగాలంటేనే జంకుతున్నారు. చాయ్ తాగాలంటే ఆలోచిస్తున్నారు.
News February 24, 2026
త్వరలో ప్రసూతి, వివాహ కానుకలు: సుభాష్

AP: ఈ-శ్రమ్ పోర్టల్‌లో రాష్ట్రం నుంచి 88.16L మంది కార్మికులు నమోదయ్యారని మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలిలో 18.24L మంది చేరారని తెలిపారు. త్వరలో కార్మికులకు వివాహ కానుక, ప్రసూతి సాయం, మరణ, అంత్యక్రియల సమయంలో ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మికుల కోసం సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తున్నామని అసెంబ్లీలో పేర్కొన్నారు.
News February 24, 2026
రూ.2,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు: అనకాపల్లి

అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో 734 గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో రూ.2,000 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లాలో నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న సడక్ రోడ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.


