News January 24, 2025
పిట్లం: పేకాట ఆడుతున్న 9 మంది అరెస్టు

పిట్లం శివారులోని ఓ ధాబాలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఎస్ఐ రాజు వివరాలిలా.. శివారులోని ఓ ధాబాలో పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు శుక్రవారం దాడి చేసి 9 మందిని అరెస్టు చేశామన్నారు. వారి నుంచి రూ.5650 నగదు, 10 సెల్ ఫోన్లు, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అసాంఘిక చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Similar News
News September 17, 2025
NPDCL కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం

హనుమకొండ NPDCL కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఎగరవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. తర్వాత విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగుల అమరుల స్తూపం వద్ద పూలదండ వేసి నివాళులర్పించారు. ఆర్థిక ప్రగతి, సంక్షేమ లక్ష్యంగా తెలంగాణ ప్రగతి సూచికల్లో అగ్రగామి రాష్ట్రంగా మారిందన్నారు.
News September 17, 2025
ఏలూరు: కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంతి

ఏలూరు కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశ మందిరంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఆమె మాట్లాడుతూ.. వాస్తుశిల్పంలో విశ్వకర్మ చేసిన కృషిని కొనియాడారు. సాంప్రదాయ వృత్తుల సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
News September 17, 2025
సిరిసిల్ల: సాయుధ పోరాట యోధుడు సింగిరెడ్డి భూపతి రెడ్డి

తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సింగిరెడ్డి భూపతి రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటూ మహాసభలో పాల్గొన్నారు. ఈయన 1930లో తహశీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ గా పనిచేసారు. అక్కడ జరిగే దుర్మార్గాలను సహించలేక పూర్తి కాలం కార్యకర్తగా తనతోపాటు అనేకమందిని ఉద్యమంలో భాగస్వాములను చేస్తూ ముందుకు సాగారు. మహమ్మదాపూర్ గుట్టల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఈయన తుది శ్వాస విడిచారు.