News January 24, 2025
పెద్దపల్లి: ఎమ్మెల్యే సొంత డబ్బులతో రాజమల్లు విగ్రహం ఏర్పాటు

పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బిరుదు రాజమల్లు లేనిలోటు తీర్చలేనిదని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా గుర్తింపు పొందిన నాయకుడు రాజమల్లు అని ఆయన కొనియాడారు. శుక్రవారం ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా తన సొంత ఖర్చులతో సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రధాన కూడలి వద్ద రాజమల్లు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.
Similar News
News January 16, 2026
ఆవులకు దిష్టి తీయడం మరవకండి

భోగి నాడు చిన్నారులపై భోగి పళ్లు పోసి దిష్టి తీసినట్లుగానే, కనుమ నాడు పాడి పశువులకు దిష్టి తీయాలని పండితులు సూచిస్తున్నారు. వాటిపై చెడు ప్రభావం పడకూడదన్నా, ఆయుష్షు పెరగాలన్నా రైతన్నలు ఈ ఆచారం పాటించాలంటున్నారు. పసుపు, కుంకుమలు కలిపిన నీటితో, హారతితో పశువులకు దిష్టి తీయాలి. అవి లక్ష్మీ స్వరూపంతో సమానం. ఇలా చేస్తే పశుసంపద సంక్షేమంగా ఉండి, రైతు ఇల్లు పాడి పంటలతో కళకళలాడుతుందని పండితులు చెబుతున్నారు.
News January 16, 2026
నేటి నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: సీఎం రేవంత్ జిల్లాల పర్యటన ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. కొరాట-చనాక బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేసిన అనంతరం సదర్మాట్ బ్యారేజ్‌ను ప్రారంభిస్తారు. రేపు మహబూబ్‌నగర్, ఎల్లుండి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంతో పాటు ఉపాధి హామీ పథకం పేరు మార్పుకు నిరసనగా సభలు నిర్వహించనున్నారు.
News January 16, 2026
శ్రీకాకుళం జిల్లాలో నేడు భోగి జరుపుకొనే ప్రాంతమిదే!

శ్రీకాకుళం జిల్లాలోని ఆ ప్రాంతవాసులు భోగి పండుగనే జరుపుకోరు. నేడు (కనుమ) రోజున ఈ వేడుకను నిర్వహించి.. అనంతరం సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. మెళియాపుట్టిలోని కొసమాల గ్రామంలో దేవాంగుల వీధిలోని చేనేతలే ఇలా భోగిని భిన్నంగా చేస్తారు. వృత్తి రీత్యా పనుల్లో తీరిక లేకపోవడమే ప్రధాన కారణం. ఆనాటి పూర్వీకుల ఆచారాన్నే ఇప్పటికీ ఆ వృత్తుల వారు కొనసాగిస్తున్నారు.


