News January 24, 2025
USలోకి అక్రమంగా ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలు: ట్రంప్

US నుంచి అక్రమ వలసదారులను పంపించేస్తున్నారు. మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్‌లో వారిని ఎక్కిస్తున్న ఫొటోలను వైట్ హౌస్ విడుదల చేసింది. ‘అక్రమ వలసదారులను తరలించే ఫ్లైట్స్ మొదలయ్యాయి. చట్టవిరుద్ధంగా USలోకి ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇదే ప్రపంచానికి ప్రెసిడెంట్ ఇచ్చే స్పష్టమైన మెసేజ్’ అని పేర్కొంది. అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలో ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News November 14, 2025
₹11,399 కోట్లతో 419 రోడ్ల విస్తరణ, అభివృద్ధి

TG: హ్యామ్ విధానంలో 419 రోడ్ల విస్తరణ, అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయించింది. ₹11,399.33 కోట్లతో 5824 KM మేర రహదారులను తీర్చిదిద్దనుంది. ఫేజ్1లో నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, నల్గొండ, సిద్దిపేట, కుమరంభీం జిల్లాల్లోని 30 రోడ్ల అభివృద్ధికి ఉత్తర్వులిచ్చింది. కాగా గతంలో అనుమతులిచ్చిన 7 రోడ్లను ఫేజ్1 నుంచి తొలగించి కొత్తవి చేర్చారు. GO విడుదలతో టెండర్లు పిలవనున్నారు.
News November 14, 2025
23వేల ఆధిక్యంలో నవీన్ యాదవ్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ లీడ్ భారీగా పెరుగుతోంది. 8వ రౌండ్ ముగిసేసరికి నవీన్ యాదవ్ 23వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వరుసగా 8 రౌండ్లలో ఆయన లీడ్ సాధించడం విశేషం. మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి.
News November 14, 2025
ఆ భవనాలు IT Hub కోసం కాదు: అధికారులు

TG: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాలను ఐటీ హబ్ కోసం ఉపయోగిస్తారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై అధికారులు స్పందించారు. అవి తప్పుడు వార్తలని స్పష్టం చేశారు. అధునాతన ఆరోగ్య సేవలను అందించడానికి ప్రభుత్వం త్వరలో సనత్‌నగర్ TIMS, వరంగల్‌లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


