News January 24, 2025
VZM: విజయసాయి రాజీనామా..బాధ్యతలు ఎవరికి?

వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డి ఆపార్టీకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. గతంలో ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను సాయిరెడ్డి చూసుకునేవారు. ఆయనపై వచ్చిన ఆరోపణలతో 2022లో ఇంఛార్జ్ బాధ్యతల నుంచి జగన్ తొలగించారు. ఓటమి తరువాత మళ్లీ ఆయనకే బాధ్యతలు ఇచ్చారు. విజయసాయి రాజీనామాతో ఇప్పుడు ఆ బాధ్యతలు ఎవరికి ఇస్తారనేది ఆసక్తిగా మారింది. బొత్స ఇప్పటికే ఉభయగోదారి జిల్లాలు చూస్తున్నారు.
Similar News
News July 6, 2025
శంషాబాద్: రేపు పోస్ట్ ఆఫీస్ సేవలు నిలిపివేత

పోస్ట్ ఆఫీస్ సేవలను సోమవారం నిలిపివేస్తున్నట్లు సౌత్ ఈస్ట్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ హైమావతి తెలిపారు. వినియోగదారులకు మరింత వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు తపాలా శాఖ పోస్టల్ టెక్నాలజీ ఐటీ 2.0ను ప్రవేశ పెడుతుంది. ఈనెల 8 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని, ఇందులో భాగంగా రేపు పోస్టాఫీసుల్లో ఎలాంటి లావాదేవీలు జరగవని పేర్కొన్నారు.
News July 6, 2025
అనకాపల్లి: నేడు ఉచితంగా రేబిస్ వ్యాక్సినేషన్

ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ వ్యాక్సిన్ వేయనున్నట్లు ఆయన జిల్లా పశువైద్యాధికారి రామ్మోహన్ రావు శనివారం తెలిపారు. అనకాపల్లి గాంధీ ఆసుపత్రిలో మాట్లాడుతూ.. స్థానిక జిల్లా ఆసుపత్రితో పాటు అన్ని మండలాల్లో గల పశువైద్య కేంద్రాల్లో రేబిస్ వ్యాక్సిన్ వేస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
News July 6, 2025
‘అన్నదాత సుఖీభవ’ అనర్హులకు అలర్ట్

AP: ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి అర్హత సాధించని రైతులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. మొదటి దశ పరిశీలన, రెండోదశ ధ్రువీకరణలో అర్హత సాధించలేకపోయిన రైతుల రికార్డులను కంప్లైంట్ మాడ్యూల్‌లో పొందుపరిచారు. అనర్హులుగా ఉన్న రైతులు ఫిర్యాదు చేసేందుకు ముందు రైతు సేవాకేంద్రంలోని సిబ్బందిని కలవాలని అధికారులు తెలిపారు. ఈనెల 10లోపు ఫిర్యాదుల స్వీకరణ ముగించాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ సూచించారు.