News January 24, 2025

దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ 

image

రేషన్ కార్డు, ఆత్మీయ భరోసా దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియను జనగామ అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ పరిశీలించారు. శుక్రవారం స్టే.ఘనపూర్ డివిజన్ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆన్‌లైన్ ప్రక్రియన పరిశీలించి ఇప్పటివరకు ఎన్ని గ్రామాల దరఖాస్తులను ఆన్ లైన్ చేశారు, ఇంకెన్ని గ్రామాలు చేయాలని అడిగి తెలుసుకున్నారు.ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా ఆన్‌లైన్ చేయాలని, అర్హులందరికి సంక్షేమ పథకాలు అందాలని ఆయన సూచించారు.

Similar News

News November 6, 2025

ఏకగ్రీవ ఎన్నిక ఓటుస్వేచ్ఛను దెబ్బతీయడం కాదు: కేంద్రం, ఈసీ

image

ఓటు స్వేచ్ఛ ఓటు హక్కుకు భిన్నమైనదని కేంద్రం, ECలు సుప్రీంకోర్టుకు నివేదించాయి. ఒక్క అభ్యర్థే ఉన్నప్పుడు ఏకగ్రీవ ఫలితం ప్రకటించడమంటే ‘నోటా’ అవకాశాన్ని కాదనడమేనన్న పిటిషన్‌పై అవి సమాధానమిచ్చాయి. ‘ఓటుహక్కు చట్టబద్ధం. ఓటుస్వేచ్ఛ రాజ్యాంగ హక్కు. పోలింగ్ జరిగినప్పుడే ఓటు స్వేచ్ఛ వర్తిస్తుంది’ అని పేర్కొన్నాయి. పోలింగే లేనప్పుడు రాజ్యాంగహక్కును దెబ్బతీసినట్లు కాదని తెలిపాయి. దీనిపై SC విచారణ చేపట్టింది.

News November 6, 2025

గద్వాల్: మహిళలు, బాలికలను వేధిస్తే కఠిన చర్యలు- SP

image

జిల్లాలో మహిళల, బాలికల రక్షణకై పోలీస్ షీ టీమ్ ప్రత్యేక దృష్టి పెట్టి, తక్షణ స్పందనతో కాల్ చేసిన వారికి భరోసా, రక్షణ కల్పిస్తూ ఆకతాయిలకు చెక్ పెడుతుందని ఎస్పీ శ్రీనివాస రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైన నిర్భయంగా షీ టీమ్ నంబర్ 8712670312కు కాల్ చేసి సేఫ్‌గా ఉండాలని అన్నారు. మహిళలను, బాలికలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News November 6, 2025

ఎల్లారెడ్డి: సలహాదారుడిని కలిసిన ఎమ్మెల్యే

image

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పదవీ బాధ్యతలు తీసుకున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం పలు సమస్యలపై ఇరువురు చర్చించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అప్పగించిన పదవికి తగిన న్యాయం చేయాలని ఆయన కోరారు.