News January 24, 2025
Bad News.. అభిషేక్ శర్మకు గాయం!
ఇంగ్లండ్‌తో రెండో టీ20 ప్రారంభానికి ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రాక్టీస్ సెషన్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మకు మడమ గాయమైనట్లు క్రిక్ బజ్ పేర్కొంది. దీంతో రెండో టీ20లో ఆయన ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. తొలి టీ20లో అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే.
Similar News
News January 26, 2025
పెరిగిన చికెన్ ధర
TG: రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రంలోని మాంసం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలున్నా చాలాచోట్ల తెరిచే ఉన్నాయి. ఆదివారం కావడంతో ప్రజలు కూడా భారీగా కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది. గత వారం వరకు కేజీ చికెన్ ధర రూ.230-240 ఉండగా ఇవాళ రూ.280-300కు చేరింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం రూ.250లోపే పలుకుతోంది. మరి మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?
News January 26, 2025
జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి
ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కఢ్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
News January 26, 2025
యుద్ధ వీరులకు ప్రధాని మోదీ నివాళి
ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళి అర్పించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికుల త్యాగాలను మోదీ స్మరించుకున్నారు. ఆయన వెంట రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు ఉన్నారు. అనంతరం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.