News March 18, 2024

HYD: సింగర్ మంగ్లీకి తప్పిన ప్రమాదం

image

ప్రముఖ గాయని మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ DCM ఢీకొన్న ఘటన HYD శంషాబాద్ పరిధి తొండుపల్లి సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. RR జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరై అర్ధరాత్రి మేఘ్ రాజ్, మనోహర్‌తో కలిసి ఆమె కారులో HYD- బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయలుదేరారు. తొండుపల్లి వంతెన వద్దకు రాగానే DCM ఢీకొట్టింది. త్రుటిలో ప్రమాదం తప్పింది.

Similar News

News August 16, 2025

HYD: గణపతికి గుమి‘గూడు’!

image

వినాయకచవితికి మరో 10 రోజులే గడువు ఉండడంతో HYDలోని వీధుల్లో సందడి మొదలైంది. గల్లీ గణేశుడికి గూడు కడుతున్నారు. నాటు కర్రలు, తడకలు, బొంగు కర్రల షాపులకు క్యూ కట్టారు. కర్రపూజ చేసి మండపం నిర్మిస్తున్నారు. విగ్రహాన్ని తీసుకొచ్చిన తర్వాత పందిరి వేస్తామని కొందరు ఆర్గనైజర్లు చెబుతున్నారు. మార్కెట్‌లో 18 ఫీట్ల కర్ర ఒక్కోటి రూ.180 నుంచి రూ.250 మధ్య అమ్ముతున్నారు. మీ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.

News August 16, 2025

HYD: డిప్లమా ఇన్ మ్యాజిక్.. దరఖాస్తుల ఆహ్వానం

image

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో డిప్లమా ఇన్ మ్యాజిక్ (ఇంద్రజాలం) కోర్సులో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు Way2Newsతో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత అయినవారు అర్హులని, నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కోర్సును ప్రతిరోజు సాయంత్రం వేళల్లో నాంపల్లి ప్రాంగణంలో నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గలవారు 90597 94553 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

News August 16, 2025

HYD: హెడ్ కానిస్టేబుల్‌పై వేధింపుల కేసు

image

ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు(39)పై వేధింపుల కేసు నమోదైంది. బల్కంపేట్‌కు చెందిన ఓ వివాహిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు ప్రముఖ కొరియోగ్రాఫర్ బంధువు అని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.