News January 25, 2025

బ్యాంక్ అధికారులతో సమావేశమైన విశాఖ సీపీ

image

విశాఖ నగరంలో బ్యాంక్ అధికారులతో సీపీ శంఖబ్రత బాగ్చి శుక్రవారం సమావేశం అయ్యారు. సైబర్ క్రైమ్ బాధితులు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే దర్యాప్తు కోసం బ్యాంకులకు పోలీసులు సమాచారం కోరితే నెల రోజులు గడిచినా సమాచారం ఇవ్వడం లేదన్నారు. సైబర్ క్రైమ్, ఏటీఎంలలో దొంగతనం జరిగినప్పుడు పోలీసులకు బ్యాంక్ అధికారులు సహకరించాలన్నారు. బ్యాంకులు, పోలీసులు పరస్పర సహకారంతో బాధితులకు న్యాయం చేయొచన్నారు.

Similar News

News January 26, 2025

విశాఖ పోలీసుల అదుపులో స్పా నిర్వాహకులు?

image

విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో ఓ స్పా సెంటర్‌పై పోలీసుల దాడులు శనివారం రాత్రి దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ ఘటనలో పశ్చిమ బంగా, విశాఖకు చెందిన ముగ్గురు యువతులతో పాటు విటుడు, స్పా నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. స్పాకు నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. కాగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News January 26, 2025

పెందుర్తి: బాల్కనీ నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

పెందుర్తిలో గల అప్పన్నపాలెంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న వెంకట సత్యనారాయణ ఇంటి బాల్కనీ నుంచి పడి మృతి చెందారు. వెంటనే భార్య హాస్పిటల్‌కు తరలించారు. తీవ్ర గాయాలవ్వడంతో అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వెంకట సత్యనారాయణ జీవీఎంసీ జోన్ -8 వేపగుంట కార్యాలయంలో బిల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

News January 26, 2025

నేడు విశాఖ రానున్న మంత్రి లోకేశ్

image

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖ రానున్నారు. ఈరోజు సాయంత్రం విశాఖ ఎయిర్పోర్ట్‌కు చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గాన నగరంలో గల టీడీపీ కార్యాలయానికి వెళ్తారు . అక్కడ ముఖ్య నాయకులతో మాట్లాడుతారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం జిల్లా కోర్ట్‌కు హాజరు అవుతారు. అనంతరం విజయవాడ తిరిగి పయణమవుతారని టీడీపీ వర్గాలు తెలిపాయి.