News January 25, 2025
సంగారెడ్డి: శిథిల భవనాల్లో తరగతులు నిర్వహించొద్దు: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలోని శిథిలావస్థలో ఉన్న అంగన్వాడి, పాఠశాలల్లో తరగతులు నిర్వహించకూడదని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో శిథిలావస్థలో ఉన్న అంగన్వాడి పాఠశాల భవనాల వివరాలను సమర్పించాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ గదులు చూసి విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని సూచించారు.
Similar News
News February 12, 2026
మెదక్: నేడు సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలలో భాగంగా గురువారం కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడాధికారి రమేశ్ తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో విజయం సాధించి, పేర్లు నమోదు చేసుకున్న క్రీడాకారులు నిర్ణీత సమయానికి హాజరు కావాలని సూచించారు. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News February 12, 2026
మంత్రాలయ మహాత్యం

మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి బృందావనం అతి పవిత్రమైనది. 1671లో స్వామివారు సజీవంగా బృందావన ప్రవేశం చేశారు. ఆయన భౌతికంగా మనకు కనిపించకపోయినా, మరో 700 ఏళ్ల పాటు అందులోనే ఉంటూ అనుగ్రహిస్తారని ప్రతీతి. కల్పవృక్షంలా కోరిన కోర్కెలు తీర్చే ఈ క్షేత్రానికి దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. స్వామివారికి సమర్పించే ‘మృత్తిక’ (పవిత్ర మట్టి) సకల వ్యాధులను, గ్రహ దోషాలను నివారిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
News February 12, 2026
జనగామ: ఒకే కుటుంబం.. మూడు తరాల ఓట్లు!

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలో బుధవారం జరిగిన ఎన్నికల్లో మూడు తరాలకు చెందిన ఓ కుటుంబం తమ ఓటు హక్కును వినియోగించుకుంది. మున్సిపల్ పరిధిలోని శివునిపల్లిలోని సుదర్శనం-సరోజన దంపతులకు చెందిన మూడు తరాల కుటుంబ సభ్యులు ఒకే వార్డులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుదర్శన్ దంపతులతో పాటు కొడుకులు, కోడళ్లు, మనుమరాళ్లు, బిడ్డ, అల్లుడు మొత్తం తొమ్మిది మంది ఓటేశారు.


