News January 25, 2025
అరకులోయలో చలి ఉత్సవాలకు ఏర్పాట్లు

అల్లూరి జిల్లా అరకులోయలో మూడు రోజులపాటు చలి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు. మారథాన్, వివిధ రాష్ట్రాల నుంచి గిరిజన సంప్రదాయ కార్నివాల్, పద్మాపురం గార్డెన్లో ఫ్లవర్ షో, వివిధ స్టాల్స్, ఫుడ్ స్టాల్ ఉంటాయన్నారు. ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం అన్నారు.
Similar News
News January 11, 2026
ASF: పీడిత వర్గాల పోరాట యోధుడు ఓభన్న: కలెక్టర్

పీడిత వర్గాల పోరాట యోధుడు ఓభన్న అని కలెక్టర్ వెంకటేష్ దోత్రే కొనియాడారు. వడ్డే ఓభన్న జయంతిని ఆసిఫాబాద్ కలెక్టరేట్లో ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పీడిత ప్రజల ఆరాధ్య దైవం, ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు ఓభన్న అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News January 11, 2026
HYD: చైనా మాంజాతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ చెయ్యి కట్!

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా తగిలి సాఫ్ట్వేర్ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలి నుంచి హఫీజ్పేట్ వైపు బైక్పై చైతన్య (27) వెళ్తున్నాడు. బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పైకి రాగానే చైతన్య చేయికి గాలి పటం మాంజా తగిలింది. దీంతో మాంజా చెయ్యికి చుట్టుకోవడంతో చైతన్య చెయ్యి తెగింది. తీవ్ర గాయాలు అయిన చైతన్యను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.