News January 25, 2025
ఇస్రో శత ప్రయోగ వీక్షణకు రిజిస్టర్ చేసుకోండి

శ్రీహరికోట నుంచి ఈనెల 29న ఉదయం 6:23 నిమిషములకు ప్రయోగించనున్న జీఎస్ఎల్వీ ఫ్ -15 రాకెట్ ప్రయోగం ప్రత్యక్షంగా వీక్షించడానికి పేర్లను రిజిస్టర్ చేసుకోవడానికి ఇస్రో సందర్శకులకు అవకాశం కల్పిస్తుంది. ఆన్లైన్ ద్వారా పేర్లను నమోదు చేసుకోవడానికి క్రింద లింకును క్లిక్ చేసి మీ పేర్లను నమోదు చేసుకొని అనుమతి పొందవచ్చు. https://lvg.shar.gov.in/VSCREGISTRATION/index.jsp
Similar News
News July 6, 2025
కొడిమ్యాల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు

కొడిమ్యాల మండలం తుర్క కాశీనగర్ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని సెంటర్ల పల్లి గ్రామానికి చెందిన బుచ్చిబాబు వేములవాడ మండలానికి చెందిన మారుతిలు పని నిమిత్తం కరీంనగర్ వైపు స్కూటీపై వెళ్తున్నారు. ఈ క్రమంలో జగిత్యాల-కరీంనగర్ హైవేపై వెళ్తున్న లారీ స్కూటీని ఢీ కొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు.
News July 6, 2025
విదేశీ గడ్డపై భారత్ సరికొత్త చరిత్ర

ఇంగ్లండ్‌పై రెండో టెస్టులో విజయంతో గిల్ సేన సరికొత్త రికార్డు సృష్టించింది. పరుగుల(336) పరంగా విదేశాల్లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. 2019లో వెస్టిండీస్‌పై 318, 2017లో శ్రీలంకపై 304, 2024లో పెర్త్‌లో ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో గెలుపొందింది. చారిత్రక విజయం సాధించిన భారత జట్టుకు కోహ్లీ, గంగూలీ అభినందనలు తెలిపారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో ప్లేయర్లు అదరగొట్టారని కొనియాడారు.
News July 6, 2025
రెవెన్యూ సమస్యలకు త్వరలోనే చెక్: మండపల్లి

రాయచోటిలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్ ఆదివారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన 22 అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.