News January 25, 2025
నంద్యాలలో డ్రోన్ల వినియోగంతో ట్రాఫిక్ పర్యవేక్షణ

నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాలలోని సంజీవ నగర్ గేట్, మున్సిపల్ ఆఫీస్, శ్రీనివాస సెంటర్‌లో శుక్రవారం ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు అధికారులు డ్రోన్‌లను వినియోగించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిని గుర్తించి జరిమానా విధించారు. అలాగే ట్రాఫిక్ రూల్స్ గురించి వాహనదారులకు వివరించారు.
Similar News
News March 14, 2025
SRD: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతాయని చెప్పారు. ఓపెన్ స్కూల్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News March 14, 2025
రొయ్యల హరిప్రసాద్‌కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు

రామాయంపేటకు చెందిన రొయ్యల హరిప్రసాద్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకు ఎంపికయ్యారు. 1999 సంవత్సరం నుంచి ఉచితంగా తనకు తెలిసిన కరాటే విద్యను అందిస్తూ ఎన్నో అవార్డులు అందుకున్నాడు. హరి ప్రసాద్ సేవలను గుర్తించిన కరాటే ఫెడరేషన్ వారు లైఫ్ టైం అచీవ్మెంట్ బెస్ట్ కరాటే మాస్టర్ అవార్డుకు ఎంపిక చేశారు. ఈనెల 16న హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో హరిప్రసాద్ అవార్డు అందుకోనున్నారు.
News March 14, 2025
15 నుంచి ఒంటిపూట బడులు

వేసవి తీవ్రత దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ లోకల్ బాడీ పాఠశాలలకు ఈనెల 15 నుండి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు నిర్వహించాలని ఆదేశించింది. జిల్లా విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారుల ద్వారా ఉత్తర్వులను, సమయ సరళిని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేయాలని ఆదేశించింది.