News January 25, 2025
జలవనరుల శాఖ ఎస్ఈగా ద్వారకనాథ్ రెడ్డి

కర్నూలు జలవనరుల శాఖ ఎస్ఈగా ఎస్.ద్వారక నాథ్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కడప తెలుగుగంగ ప్రాజెక్టులో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ద్వారక నాథ్ రెడ్డి పదోన్నతిపై కర్నూలు ఎస్ఈగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇన్‌ఛార్జ్ ఎస్ఈగా బాల చంద్రా రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు.
Similar News
News January 17, 2026
కర్నూలులో మహిళా దొంగల అరెస్ట్

కర్నూలు ఆర్టీసీ బస్టాండులో చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన రోజీ సుల్తానా, షేక్ రఫీకా అనే మహిళలను 4వ పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నవంబర్ 30న శారద అనే మహిళ కోవెలకుంట్ల బస్సు ఎక్కుతున్న సమయంలో ఆమె బ్యాగులోని 9 తులాల బంగారు నగలను దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వారిని గుర్తించి, అరెస్టు చేసినట్లు 4వ పట్టణ సీఐ విక్రమ సింహ తెలిపారు.
News January 17, 2026
జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు కర్నూలు యువతి

జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు కర్నూలు బి.క్యాంప్‌కు చెందిన శ్రీహిత ఎంపికైనట్టు శిక్షకులు పాలు విజయకుమార్, బ్రహ్మ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈనెల 21న నుంచి 28వ తేదీ వరకు మణిపూర్‌లో జరిగే అండర్-19 ఎస్జీఎఫ్ఐ ఫుట్‌బాల్ పోటీలలో శ్రీహిత పాల్గొంటుందని పేర్కొన్నారు. గత అక్టోబర్‌లో ఎమ్మిగనూరులో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ఐ పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వెల్లడించారు.
News January 17, 2026
మళ్లీ చెప్పున్నా.. జాగ్రత్త: కర్నూలు ఇన్‌ఛార్జ్ ఎస్పీ

ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు SMలో ఫేక్ లింకులు పంపి మోసం చేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలను డీఐజీ, కర్నూలు ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. పీఎం కిసాన్, ముద్ర లోన్స్, సూర్యఘర్, అమ్మఒడి వంటి పథకాల పేరుతో వచ్చే లింకులను క్లిక్ చేయవద్దన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దన్నారు. అనుమానాస్పద కాల్స్, లింకులు వస్తే 1930కు ఫోన్ చేయాలన్నారు.


