News January 25, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: జనవరి 25, శనివారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4.32 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 6.08 గంటలకు ✒ ఇష: రాత్రి 7.23 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News January 26, 2025
పార్వతీపురం జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి ప్రశంసాపత్రం
పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కే.రాబర్ట్ పాల్‌కు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ప్రశంస పత్రాన్ని అందజేశారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎస్పి ఎస్.వి మాధవ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. సకాలంలో రైతులకు విత్తనాలు అందజేసినందుకుగాను ప్రశంసాపత్రం అందజేశారు.
News January 26, 2025
మువ్వన్నెల వెలుగుల్లో సెక్రటేరియట్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో తెలంగాణ సచివాలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. ఈ భవనాన్ని కాషాయ, తెలుపు, ఆకుపచ్చ రంగుల లైట్లతో అలంకరించారు. దీంతో సెక్రటేరియట్ భవనం మువ్వన్నెల విద్యుద్దీపాలతో కాంతులీనింది. నిన్న రాత్రి తీసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
News January 26, 2025
మన తొలి ‘రిపబ్లిక్ డే’కు అతిథి ఎవరంటే..
ఈ ఏడాది భారత గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. మన తొలి రిపబ్లిక్ డేకు కూడా ఇండోనేషియా అధ్యక్షుడే చీఫ్ గెస్ట్ కావడం విశేషం. 1950లో ఇర్విన్ యాంఫీ థియేటర్లో నిర్వహించిన వేడుకలకు ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకర్ణో ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఆ దేశానికి స్వాతంత్ర్యం దక్కడంలో భారత్ అండగా నిలిచింది.