News March 18, 2024
పోరుమామిళ్ల: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక పోరుమామిళ్ల మండలం బాలరెడ్డిపల్లికు చెందిన బాలకృష్ణ(35) అనే రైతు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. బాలకృష్ణ నాలుగు ఎకరాలు మొక్కజొన్న పంట సాగు చేశారు. ఆశించిన మేర దిగుబడి రాకపోగా, తెచ్చిన అప్పులు తీర్చలేక మనోవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. రైతు భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.
Similar News
News February 5, 2026
కడప: ‘ఇంటర్ పరీక్షలు పక్కగా నిర్వహించాలి’

ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు అధికారులకు సూచించారు. కడప కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని, గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలను చేరుకోవాలని ఆయన కోరారు.
News February 5, 2026
కడప: అప్పుడే మొదలైన ఎండలు.!

కడప జిల్లాలో అప్పుడే ఎండాకాల ప్రభావం మొదలైంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండలు పలు చోట్ల మండుతున్నాయి. బుధవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాదాపు 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణం పొడిగా ఉంది. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. మీ ఊరిలోనూ ఇలాగే ఉందా.?
News February 5, 2026
కడప: ఏడుగురు అరెస్ట్

కలసపాడు మండలం పెండ్లిమర్రిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై సుభాన్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు పెండ్లిమర్రిలో రెండు పేకాట స్థావరాలపై దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో ఏడుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.7500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.


