News January 25, 2025

యాదాద్రి భువనగిరి: గ్రామ సభలకు 74,614 దరఖాస్తులు

image

యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగు రోజులగా నిర్వహిస్తున్న గ్రామసభలు నేటితో ముగిసాయి. జిల్లాలో గ్రామసభల ద్వారా 74,614 దరఖాస్తులను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. రైతు భరోసా 2698 దరఖాస్తులు, రేషన్ కార్డులు కొరకు 28,049 దరఖాస్తులు, ఇందిరమ్మ ఇండ్ల కొరకు 32,316 దరఖాస్తులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 11,551 దరఖాస్తులు వచ్చాయి.

Similar News

News November 8, 2025

నెలకు రూ.10 లక్షలు కావాలా?.. షమీ మాజీ భార్యపై ఫైర్

image

తనకు నెలకు రూ.4 లక్షల భరణం సరిపోవట్లేదని, రూ.10 లక్షలు కావాలని షమీ మాజీ భార్య జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. విడాకుల తర్వాత మళ్లీ మాజీ భర్తపై ఆధారపడటం ఎందుకని, సొంతకాళ్లపై నిలబడటం రాదా అని ప్రశ్నిస్తున్నారు. మెయింటెనెన్స్ అనేది కాస్ట్ ఆఫ్ లివింగ్, పిల్లల ఖర్చు ప్రకారం ఉండాలని, ఆదాయం ఆధారంగా కాదని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News November 8, 2025

HYD: పార్కు కాదు.. పచ్చని డంపింగ్ యార్డు

image

డంపింగ్‌ యార్డ్‌ అనగానే చెత్త, చెదారంతో నిండిన దుర్వాసన గూడు గుర్తుకువస్తుంది. కానీ HYD శివారు పీర్జాదిగూడ బల్దియా పర్వతాపూర్‌ డంపింగ్‌ యార్డ్‌ ఆ అభిప్రాయాన్ని తలకిందులు చేస్తోంది. చెత్త మాయమై, పచ్చదనం పరచుకుంది. పచ్చిక బయళ్లు, ఓపెన్‌ జిమ్‌లు అలరారుతున్నాయి. ‘ఇది డంపింగ్‌ యార్డా? లేక పార్కా?’ అనే అనుమానం కలిగిస్తోంది.

News November 8, 2025

గూడూరు: ఒక్కడే కొడుకు.. పుత్ర శోకం మిగిల్చాడు!

image

గూడూరు మండల కేంద్రానికి చెందిన <<18232373>>షేక్ సోహెల్<<>> శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మండలంలో పత్రిక విలేఖరిగా పనిచేస్తున్న యాకూబ్‌కు ఒక్కగానొక్క తనయుడు సోహెల్. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. తన తనయుడు ఉద్యోగాలకు ప్రయత్నిస్తూనే తమ మొబైల్ షాప్‌లో చేదోడు వాదోడుగా ఉండేవాడు. కొడుకు ఇక రాడని తండ్రి కన్నీటి పర్యంతమైన తీరు పలువురి హృదయాలను ద్రవింపజేసింది.