News January 25, 2025
MHలో భారీ పేలుడు.. 8కి చేరిన మృతుల సంఖ్య
మహారాష్ట్ర భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ <<15243613>>పేలుడు<<>> ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరినట్లు నాగపూర్ పోలీసులు వెల్లడించారు. ఉ.11గంటలకు ఘటన జరగ్గా, సహాయక చర్యలకు 8గంటల సమయం పట్టిందన్నారు. ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న 13మందిలో 8మంది చనిపోగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయని చెప్పారు. ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర CM ఫడణవీస్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
Similar News
News January 27, 2025
ఆర్టీసీలో సమ్మె సైరన్
TG: ఆర్టీసీలో ఇవాళ్టి నుంచి సమ్మె సైరన్ మోగనుంది. ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల విధానాన్ని పునఃసమీక్షించి, తమ సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్లతో సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్టు ఆర్టీసీ జేఏసీ తెలిపింది. నేటి సాయంత్రం 4 గంటలకు బస్‌భవన్‌లో యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేయనుంది. కాగా ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులతో సంస్థలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని జేఏసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
News January 27, 2025
ట్రంప్ 2.0: ప్రపంచ శాంతికి మేలేనన్న భారతీయులు
అమెరికా ప్రెసిడెంటుగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికవ్వడంపై మెజారిటీ భారతీయులు సానుకూలంగా ఉన్నారని ECFR సర్వే పేర్కొంది. ‘Trump Welcomers’ కేటగిరీలో వారే ఎక్కువగా ఉన్నారని తెలిపింది. ఆయన గెలుపు ప్రపంచ శాంతికి మేలని 82, భారత్‌కు మంచిదని 84, US పౌరులకు మంచిదని 85% భారతీయులు అన్నారు. చైనా, తుర్కియే, బ్రెజిల్ పౌరులూ ఇలాగే భావిస్తున్నారు. EU, UK, AUSలో ఎక్కువగా ‘Never Trumpers’ కేటగిరీలో ఉన్నారు.
News January 27, 2025
TTD Update: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌లేని భక్తులకు సర్వదర్శనానికి 6గంటల సమయం పడుతోంది. ఇక శ్రీవారిని నిన్న 74,742 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 22,466 మంది తలనీలాలు సమర్పించారు. రూ.3.67 కోట్ల ఆదాయం హుండీకి సమకూరినట్లు అధికారులు తెలిపారు.