News January 25, 2025
మహానందిలో 1.20లక్షల లడ్డూలు సిద్ధంగా ఉంచుతాం: ఈవో
మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా గత ఏడాది 1,10,000 లడ్డూ ప్రసాదాలు విక్రయించామని మహానంది ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ మేరకు లడ్డు, పులిహోర ప్రసాదాలు సరిపడా అందుబాటులో ఉంచుతామన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం 1,20,000 లడ్డూలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రసాదాలు విక్రయిస్తామన్నారు.
Similar News
News January 27, 2025
WGL: గోల్డ్ మెడల్ సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు
జనవరి 23 నుంచి 26 వరకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని సాయి గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహించిన అనంత్ బజాజ్ మెమోరియల్ తెలంగాణ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్- 2025లో సామల శ్రీ చేతన్ శౌర్య గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ సందర్భంగా క్రీడాకారుడిని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ కుమార్, కోచ్ మాడిశెట్టి శ్రీధర్ అభినందించారు.
News January 27, 2025
ఆ సినిమా చూసే.. భార్యను ముక్కలుగా నరికాడు
మలయాళ క్రైమ్, థ్రిల్లర్ ‘సూక్ష్మదర్శిని’ సినిమా స్ఫూర్తితోనే తన భార్య మాధవిని హత్య చేసినట్లు గురుమూర్తి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో దత్తత తీసుకున్న కూతురిని తల్లి, కుమారుడు కలిసి హత్య చేస్తారు. ఆమె మృతదేహాన్ని మాయం చేసేందుకు శరీర భాగాలను ఓ ట్యాంకులో వేసి కెమికల్స్ పోసి కరిగిస్తారు. ఆ నీళ్లను వాష్ రూమ్ ఫ్లష్ ద్వారా వదులుతారు. ఆ మూవీలో చేసినట్లే గురుమూర్తి కూడా మాయం చేశాడు.
News January 27, 2025
చెన్నైలో విశాఖ డాక్టర్ అరెస్ట్
విశాఖలో కిడ్నీ ఆసుపత్రి నిర్వహిస్తున్న డా.రాజశేఖర్‌ను చెన్నైలో హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారం రోజులుగా హైదరాబాద్, చెన్నై కేంద్రాలుగా నడుస్తున్న కిడ్నీ రాకెట్‌పై పోలీసులు దృష్టి సారించారు. ఈ రాకెట్‌లో విశాఖకు చెందిన డా.రాజశేఖర్ ఓ ముఠాను ఏర్పాటు చేసి కిడ్నీల మార్పిడికి పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అతనిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు.