News January 25, 2025

నంద్యాలలో రూ.8కోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి ఫరూక్

image

తెలుగుదేశం పార్టీ గెలిచిన ఆరు నెలల్లోనే నంద్యాలలో రూ.8కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించామని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయాన్ని తొలిసారిగా సందర్శించిన ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షించి పెండింగ్ పనులు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. నంద్యాలను అన్ని విధాలా అభివృద్ధి చేసి తీరుతామని మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు.

Similar News

News January 27, 2025

తాళ్లరేవు: చనిపోయి మరో ఇద్దరికి చూపునిచ్చిన మహిళ

image

ప్రముఖ దినపత్రికలో తాళ్లరేవు మండల విలేకరిగా వూడా వెంకటరమణ పనిచేస్తున్నారు. ఆయన సతీమణి హేమవతి(45) ఆదివారం మృతి చెందారు. ఈ మేరకు వెంకటరమణ తన శ్రీమతి నేత్రాలను కాకినాడ బాదం బాలకృష్ణ ఐ బ్యాంకుకు దానమిచ్చారు. చనిపోయి ఆమె ఇద్దరికి చూపునిచ్చిందని మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద అభినందించారు. సతీ వియోగంతో బాధపడుతున్న విలేకరి వెంకటరమణను తాళ్లరేవు ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పరామర్శించారు.

News January 27, 2025

శ్రీ భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు

image

వరంగల్ లోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళీ అమ్మవారు ఈరోజు సోమవారం సందర్భంగా ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

News January 27, 2025

కిడ్నీ రాకెట్ వ్యవహారంలో నల్గొండ వాసులు 

image

కిడ్నీ రాకెట్ ఘటనలో నల్గొండ పేరు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ వ్యవహారంలో అరెస్టైన వారిలో నల్గొండకు చెందిన నలుగురు మెడికల్ అసిస్టెంట్లు ఉండడం చర్చనీయాంశం అయ్యింది. NLGకు చెందిన రమావత్ రవి, సపావత్ హరీశ్, సపావత్ రవీందర్, పొదిల సాయి అరెస్టైన వారిలో ఉన్నారు. కాగా.. 2016లో ఈ తరహా ఘటన నల్గొండలో జరగ్గా.. ఇప్పుడు కూడా నల్గొండ వాసులు ఉండడం నివ్వెర పరుస్తోంది.