News January 25, 2025
కామారెడ్డి కలెక్టర్‌కు అవార్డు

కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్‌కు 2024 ఏడాదికి గాను బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డుకు ఎంపికయ్యారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో శనివారం జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ఆయన అందుకోనున్నారు. కాగా ఆయన గతేడాది నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా పని చేసినప్పుడు ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ, ఓటర్ నమోదులో విశేష కృషికి ఈ అవార్డు అందుకోనున్నారు.
Similar News
News September 14, 2025
రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ఈ నెల 15న సోమవారం ఉదయం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రామ సుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.
News September 14, 2025
ఉగ్రస్థావరాల పునరుద్ధరణకు సాయం.. పాక్ వక్రబుద్ధి!

పాక్ మరోసారి వక్రబుద్ధి చాటుకుంది. ఇటీవల భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన వారిని ఆదుకునేందుకు నిధులను సేకరించింది. అయితే వాటిని బాధితులకు పంచకుండా ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన లష్కరే తోయిబా(LeT) ఉగ్రస్థావరాల పునరుద్ధరణకు మళ్లించింది. అంతకుముందు LeTకి పాక్ రూ.1.25 కోట్లు మంజూరు చేసింది. పునరుద్ధరణకు మొత్తం రూ.4.7 కోట్లు ఖర్చవుతుందని, పాక్ ఆ నిధుల సేకరణలో నిమగ్నమైందని భారత నిఘా వర్గాలు తెలిపాయి.
News September 14, 2025
జూబ్లీహిల్స్‌లో ప్రజలతో మంత్రుల ముఖాముఖీ

జూబ్లీహిల్స్‌లోని సోమాజిగూడ డివిజన్‌లో జయ ప్రకాశ్ కాలనీ, ఇంజినీర్స్ కాలనీ ప్రజలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు ముఖాముఖీ నిర్వహించారు. రోడ్లు, డ్రైనేజీలు, పలు సమస్యలు స్థానికులు మంత్రికి తెలిపారు. వారు మాట్లాడుతూ.. అధికారులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. సమస్యల వినతులపై పరిష్కారం చేస్తామన్నారు.