News January 25, 2025

ఆర్మూర్: ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. చంద్రిక ఒక ప్రకటనలో తెలిపారు. B.Ped, M.Ped చేసిన వారికి అనుభవాన్ని బట్టి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ నెల 27న సోమవారం ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ, డెమో ఉంటుందన్నారు.

Similar News

News January 27, 2025

నిజామాబాద్‌లో శునకాలకు బారసాల

image

నిజామాబాద్ నగర శివారులోని మాణిక్‌భండార్‌లో ఓ కుటుంబం ఆదివారం శునకాలకు బారసాల చేశారు. మాణిక్ బండారుకు చెందిన నర్సాగౌడ్, మంజుల దంపతులు ఓ శునకాన్ని తెచ్చుకుని దానికి లూసీ అని పేరు పెట్టారు. లూసీ ఇటీవల ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో వాటికి ఆ దంపతులు ఘనంగా బారసాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బంధువులతో పాటు చుట్టుపక్కల వారిని పిలిచి ఘనంగా విందు ఏర్పాటు చేశారు.

News January 27, 2025

NZB: మాణిక్‌భండార్‌లో శునకాలకు బారసాల

image

నిజామాబాద్ నగర శివారు మాణిక్‌భండార్‌లో ఓ కుటుంబం ఆదివారం శునకాలకు బారసాల చేశారు. మాణిక్ బండారుకు చెందిన నర్సాగౌడ్ మంజుల దంపతులు ఓ శునకాన్ని తెచ్చుకుని దానికి లూసీ అని పేరు పెట్టారు. లూసీ ఇటీవల ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. వీటికి ఆదివారం ఆ దంపతులు ఘనంగా బారసాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బంధువులతో పాటు చుట్టుపక్కల వారిని పిలిచి ఘనంగా విందు ఏర్పాటు చేశారు.

News January 26, 2025

NZB: ఉత్తమ ప్రిన్సిపల్‌గా డీఐఈఓ రవికుమార్

image

జిల్లాలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల ఉత్తమ ప్రిన్సిపల్‌గా తిరుమాలపూడి రవికుమార్ ఎంపికయ్యారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు చేతుల మీదుగా ఆదివారం ప్రశంసాపత్రం అందుకున్నారు. కాగా జిల్లా ఇంటర్ విద్య అధికారిగా కూడా రవికుమార్ కొనసాగుతున్నారు.