News January 25, 2025

Greenery: కేరాఫ్ అనంతగిరి

image

గ్రీనరీకి కేరాఫ్ మన అనంతగిరి హిల్స్. హైదరాబాద్‌ వాసులు వీకెండ్‌లో ఇక్కడికి వచ్చి రీలాక్స్ అవుతుంటారు. మూసీ పుట్టింది కూడా ఇక్కడే కావడం విశేషం. దీనికితోడు అనంత పద్మానాభ స్వామి టెంపుల్, కోట్‌పల్లి ప్రాజెక్ట్, పరిగి విండ్ మిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ట్రెక్కింగ్ చేసే వారికి అనంతగిరి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మరి మన జిల్లాలో ఇంకేమైనా వింతలు, విశేషాలు, ఫేమస్ ప్లేస్‌లు ఉంటే కామెంట్ చేయండి.

Similar News

News November 7, 2025

నిడదవోలు: పీఎంజేవై‌లో 757 ఇల్లు మంజూరు

image

జిల్లాలో పీఎం ఆవాస్ యోజన పథకం కింద పట్టణ ప్రాంత వాసులకు 757 గృహాలు మంజూరైనట్లు జిల్లా గృహ నిర్మాణ శాఖాధికారి ఎం. బుజ్జి తెలిపారు. ఆమె గురువారం నిడదవోలు మండలంలో క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పీఎంఏవై పథకం కొత్త మార్గదర్శకాలు విడుదలైనట్లు ఆమె పేర్కొన్నారు. నిడదవోలు, కొవ్వూరు మున్సిపాలిటీలతో పాటు రాజమహేంద్రవరం నగర కార్పొరేషన్ పరిధిలోని లబ్ధిదారులకు ఈ గృహాలు అందుతాయని వెల్లడించారు.

News November 7, 2025

నవీన్ యాదవ్‌పై ఈసీకీ బీఅర్ఎస్ ఎంపీల ఫిర్యాదు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో సీఎం, మంత్రులు, కాంగ్రెస్ నాయకుల కోడ్ ఉల్లంఘించారని ఢిల్లీలోని ఈసీకి BRS MPలు గురువారం ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజున కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓట్ల రిగ్గింగ్, దొంగ ఓట్లకు పాల్పడే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉపఎన్నిక నేపథ్యంలో తక్షణమే కేంద్ర బలగాల నియమించి, ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.

News November 7, 2025

ఆత్మకూరు: గుర్తు తెలియని శవం లభ్యం

image

తిప్పడం పల్లి సమీపంలో ఊక చెట్టు వాగు ఒడ్డున గుర్తు తెలియని శవం లభ్యమైనట్లు ఆత్మకూరు ఎస్సై జయన్న తెలిపారు. ఆత్మకూరు రెవెన్యూ కార్యాలయంలో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ పరుశరాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడి వయస్సు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండొచ్చన్నారు. ఆకుపచ్చ టీ షర్ట్ ధరించి ఉన్నాడని, శవాన్ని గుర్తుపట్టిన వారు పోలీసులను సంప్రదించాలన్నారు.