News January 25, 2025
విజయవాడలో 2 ఏళ్ల బాలుడి కిడ్నాప్.. కారణమిదే.!

విజయవాడ గవర్నర్ పేట పోలీసులు 2 ఏళ్ల బాలుడి మిస్సింగ్ కేసును ఛేదించిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. కృష్ణా జిల్లాకు చెందిన ఓ బాలిక పిల్లలను కిడ్నాప్ చేసి అమ్మి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలోని ఓ బాలుడిని కిడ్నాప్ చేసిందని చెప్పారు. ఈ కేసును 4 గంటల వ్యవధిలో ఛేదించిన సీఐ నాగమురళి, ఎస్ఐలు దుర్గారావు, ప్రశాంతిలను సీపీ అభినందించారు.
Similar News
News September 17, 2025
ఒక్క మండలంలోనే 3 వేల బోగస్ పట్టాలు.. ‘భరోసా’ బంద్

TG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘భూ భారతి’ పైలట్ ప్రాజెక్టు సర్వేతో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నల్గొండ(D) తిరుమలగిరి(M)లో 3 వేల బోగస్ పట్టాలను అధికారులు గుర్తించి రద్దు చేశారు. ఆయా భూములకు సంబంధించిన అక్రమ లబ్ధిదారులకు రైతు బీమా, రైతు భరోసా వంటి ప్రభుత్వ పథకాలను నిలిపేశారు. దీనిపై సమీక్షించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అర్హులైన 4 వేల మందికి త్వరలో కొత్త పట్టాలిస్తామని ప్రకటించారు.
News September 17, 2025
దొడ్డి కొమురయ్య మృతితో సాయుధ పోరాటం ఆరంభం..!

జనగామ తాలూకాలోని ‘దొర’ విసునూరు రామచంద్రారెడ్డి ఆగడాలే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి దారితీసింది. చాకలి ఐలమ్మ అనే బడుగు బలహీన వర్గానికి చెందిన మహిళ భూమిని దొర ఆక్రమించుకునేందుకు యత్నించడంతో దొడ్డి కొమురయ్య నాయకత్వంలో రైతులు కడవెండిలోని దొర ఇంటిని ముట్టడించేందుకు ర్యాలీగా వెళ్తున్న క్రమంలో జరిపిన కాల్పుల్లో దొడ్డి కొమురయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దాంతో సాయుధ పోరాటం ఉద్ధృతమైంది.
News September 17, 2025
రావి ఆకుపై హైదరాబాద్ విలీనం నాటి ఫోటో

నారాయణఖేడ్‌కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ ఆకుప, సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు తలవంచి నమస్కరిస్తున్న నవాబు నిజాం చిత్రం రూపొందించి బుధవారం ఆవిష్కరించారు. ఆర్టిస్ట్ మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 17న భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ ఫోలోతో హైదరాబాద్ నవాబ్ నిజాం లొంగి పోయారన్నారు. దీంతో హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైందని చెప్పారు.