News January 25, 2025

గద్వాలలో డేంజర్ ఫుడ్.!

image

జిల్లాల్లోని విచ్చలవిడిగా కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నారు. ఇటీవల గద్వాలలో నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ దందాను పోలీసులు పట్టుకున్నారు. ఈనెల11న ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ముఠాలో ఒకరు జిల్లాలో ఫ్యాక్టరీ పెట్టి దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. GWL, WNP, NGKL జిల్లాల్లోని చిరు వ్యాపారులకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. తక్కువ ధరకు అమ్మే ఆహార పదార్థాల పట్ల జాగ్రత్త.!

Similar News

News November 9, 2025

ప్రచారానికి వాళ్లు దూరమేనా!

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఉన్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రచారానికి దూరమైనట్లేనని సమాచారం. నేటితో ప్రచార పర్వం ముగియనుండగా ఆయన వచ్చే సూచనలు కనిపించట్లేదు. ఆ బాధ్యతలను కేటీఆర్ భుజాలపై వేసుకొని కొనసాగిస్తున్నారు. అటు బీజేపీ నుంచి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, అన్నామలై, పురందీశ్వరి, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ వస్తారని పేర్కొన్నా ఇప్పటి వరకు వారి జాడే లేదు.

News November 9, 2025

మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ తప్పులు చేయకండి

image

మనీ ప్లాంట్ ఇంట్లో సానుకూల శక్తిని, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుందని నమ్మకం. అయితే కొన్ని పొరపాట్లు ఆ శక్తిని ప్రతికూలంగా మారుస్తాయట. ‘మనీ ప్లాంట్ ఎండిపోకూడదు. ఎండిపోయిన ఆకులను తొలగిస్తూ ఉండాలి. లేకపోతే ధన నష్టానికి అవకాశముంది. ఈ ప్లాంట్‌ను ఇంటి లోపల పెంచడం ఉత్తమం. ప్రధాన ద్వారం బయట, మెయిన్ డోర్‌కు ఎదురుగా ఉంచకూడదు. ఈ నియమాలతో డబ్బు ప్రవాహం పెరుగుతుంది’ అని నిపుణులు సూచిస్తున్నారు.

News November 9, 2025

తంబళ్లపల్లి: ‘టమాటా రైతులను ఆదుకోండి’

image

టమాటా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. తంబళ్లపల్లి (M)లో టమాటాను పండించిన రైతులు తుఫాన్ ప్రభావంతో గిట్టుబాటు ధరల్లేక రోడ్లపై పడేస్తున్నామంటున్నారు. గుండ్లపల్లి, గోపిదిన్నె, కన్నెమడుగు, కొటాల తదితర పంచాయతీల్లో సుమారు వెయ్యి ఎకరాలకు పైగా రైతులు పంటలు వేశామన్నారు. ఎకరాకు రూ.2 లక్షలు వరకు ఖర్చును ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందన్నారు.