News January 25, 2025

ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన భద్రకాళి అమ్మవారు

image

వరంగల్‌లోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి అమ్మవారు శనివారం సందర్భంగా ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు వితరణ చేశారు.

Similar News

News January 27, 2025

వరంగల్ రోడ్డులో కారు, ఆటో ఢీ.. ఇద్దరికి గాయాలు

image

ఖమ్మం, వరంగల్ రోడ్డులోని బెటాలియన్ హెచ్‌పీ పెట్రోల్ పంపు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి బొల్లికుంటకు వెళ్తున్న కారు నల్లబెల్లి నుంచి వరంగల్ వెళ్తున్న ఆటోను ఢీకొంది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను 108లో ఎంజీఎంకు తరలించారు. ఘటనా స్థలానికి చెరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 27, 2025

గీసుగొండ: నీటి సంపులో పడి ఆరేళ్ల బాలుడు మృతి

image

గీసుగొండ మండలంలోని శాయంపేట హవేలీ గ్రామంలో బాలుడు నీటి సంపులోపడి మృతి చెందాడు. CI మహేందర్ కథనం ప్రకారం.. బెల్లంపల్లికి చెందిన శుభశ్రీ తన కుమారుడు శివాదిత్య(6)తో కలిసి శాయంపేటలోని తల్లిగారింట్లో నివాసం ఉంటుంది. ఆదివారం శుభశ్రీ స్నానానికి వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి కుమారుడు కనిపించకపోవడంతో గాలించింది. కాగా ఇంటి పక్కన ఉన్న నీటి సంపులో చనిపోయి కనిపించడంతో కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.

News January 26, 2025

రోడ్డు ప్రమాదంపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు

image

వరంగల్ జిల్లా మామునూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై మాజీ మంత్రి హరీష్ రావు ‘X’ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు.