News January 25, 2025

ఎర్రబడ్డ ఆకాశం!

image

అందాలను ఆవిష్కరించడానికి ఆకాశాన్ని మించిన చిత్రకారుడు ఉండరు అనడంలో సందేహం లేదు. సూర్యోదయం, సూర్యాస్తమయం వేళలో ఆకాశంలో కనిపించే అందాలను చూసిన ప్రకృతి ప్రేమికులు మైమరచి పోవాల్సిందే. శుక్రవారం సాయంత్రం మహానంది సమీపంలో ఆకాశంలో మంటలు చెలరేగాయా.. అన్నట్లు కనిపించిన మేఘాల దృశ్య మాలిక ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంది. దివి నుంచి భువికి మంటలు దిగి వచ్చాయా అన్నట్లు ఉన్న అందాలను స్థానికులు ఫోన్లలో బంధించారు.

Similar News

News September 16, 2025

గరుగుబిల్లి: రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి

image

గరుగుబిల్లి మండలం నందివానవలస కోళ్లు ఫారం వద్ద సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో గిజబ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ మరాడన ఆదినారాయణ మృతి చెందాడు. ఖడ్గవలస నుంచి రాత్రి 10 గంటల సమయంలో స్వగ్రామం గిజబకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఓ వాహనం ఢీకొనడంతో ఆదినారాయణ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై ఎస్‌ఐ ఫక్రుద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 16, 2025

హైవేల వల్ల భూములు విలువ పెరుగుతుంది: కలెక్టర్

image

గ్రీన్ ఫీల్డ్ హైవేకు సంబంధించిన రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌లతో కలిసి దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే భూ సేకరణ సమస్యపై రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులకు అన్యాయం చేయాలని ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, హైవే రావడం వల్ల భూముల విలువ పెరుగుతుందన్నారు.

News September 16, 2025

HYD: ఎకరా రూ.101 కోట్లు.. ఇది బేస్ ప్రైజే..!

image

రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 18.67 ఎకరాల భూమిని వచ్చే అక్టోబర్ 6న ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఒక్కో ఎకరానికి ప్రారంభ ధరను రూ.101 కోట్లుగా నిర్ణయించి, వేలం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ భూముల విక్రయంతో ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం రాబోతుందని అంచనా. నగరంలో అత్యంత ప్రైమ్ లొకేషన్‌లో ఉన్న ఈ భూములపై ఇప్పటికే పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.