News January 25, 2025
భైరవపట్నంలో అగ్ని ప్రమాదం

మండవల్లి మండలంలోని భైరవపట్నం , ప్రత్తిపాడు స్టేజీ వద్ద నివాసముంటున్న పిట్టలోళ్ల గుడిసెలు ప్రమాదవశాత్తు శుక్రవారం రాత్రి దగ్ధమయ్యాయి. 30 గుడిసెలలోని 25 కుటుంబాల వాళ్లు నిరాశ్రయులయ్యారు. దోమల నివారణకు వెలిగించిన నిప్పు ప్రమాదానికి కారణమైందని భావిస్తున్నారు. స్థానికులు గాయపడ్డ పది మందిని కైకలూరు ఆసుపత్రికి తరలించారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News February 24, 2026
జగిత్యాల: గోదావరి పుష్కరాలపై ఎస్పీ సమీక్ష

జగిత్యాల జిల్లాలో జరగనున్న గోదావరి పుష్కరాలు-2027 నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పుష్కర ఘాట్‌లు, వీఐపీ ఘాట్‌లు, తాత్కాలిక స్నాన ఘాట్‌ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాటు, మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రోజుకు సుమారు 15 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశముండటంతో ట్రాఫిక్ నియంత్రణ, వన్‌వే మార్గాలు చూడాలన్నారు.
News February 24, 2026
రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్ వెట్రిసెల్వి

జిల్లాలో రీ-సర్వే పురోగతిపై కలెక్టర్ వెట్రి సెల్వి మంగళవారం ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రత్యేక సీఎస్ సాయి ప్రసాద్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జయలక్ష్మికి వివరాలు వెల్లడిస్తూ.. 248 గ్రామాల్లో సర్వే చేపట్టామన్నారు. ఇప్పటికే మూడు దశల్లో 113 గ్రామాల్లో ప్రక్రియ పూర్తయిందని, ప్రస్తుతం 40 గ్రామాల్లో నాలుగో దశ లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని కలెక్టర్ వివరించారు.
News February 24, 2026
తూ.గో: ‘ఆ పాల పదార్థాలను వినియోగించవద్దు’

గణేశ్వరరావు నుంచి కొనుగోలు చేసిన పాలు, ఇతర పాల ఉత్పత్తులను వినియోగించరాదని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం స్పష్టం చేశారు. గణేశ్వరరావు సరఫరా చేసిన పాలు కల్తీ అయినట్లు గుర్తించామన్నారు. ఈ పాలు, వాటి ద్వారా తయారైన పెరుగు, కోవా, నెయ్యి, మీగడ వంటి పదార్థాలు ఎక్కడ నిల్వ ఉన్నా వెంటనే తొలగించి, సురక్షితంగా నాశనం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


