News January 25, 2025
చేర్యాల: ఆరుగురు పేకాట రాయళ్ల అరెస్ట్

చేర్యాల పట్టణ శివారులోని పేకాట ఆడుతున్న పలువురిని టాస్క్ ఫోర్స్, పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. కుడి చెరువు సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో స్థావరాలపై దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 15,954 నగదు, ఆరు సెల్ ఫోన్లు, 5 బైకులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 15, 2025
పాఠశాలల్లో డ్రాపౌట్లు ఉండకూడదు: కలెక్టర్ సిరి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు డ్రాపౌట్లు కాకుండా చూడాలని, పిల్లలను వలసలకు తీసుకెళ్లే తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి విద్యా శాఖాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో డీఈఓ, ఎంఈఓలతో నిర్వహించిన సమీక్షలో ఆమె ఈ ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమ ప్రాంతంలో ఈ సమస్యపై దృష్టి సారించాలని సూచించారు.
News November 15, 2025
కలియుగ ధర్మ సూత్రమిదే..

ఈ కలియుగంలో నీ గతం ఎంత గొప్పదైనా నీవు చేసిన ఒక్క తప్పును జనం చెడుగానే పరిగణిస్తారు. వంద మంచి పనులు చేసినా, ఒక చిన్న లోపం కనిపిస్తే, లోకం నిన్ను చెడ్డవానిగా ముద్రవేస్తుంది. అదేవిధంగా నీ గతం ఎంత చెడ్డదైనా, చిత్తశుద్ధితో చేసిన ఒక్క మంచి పని అయినా నిన్ను మంచివానిగా నిలబెట్టగలదు. అందుకే జనాభా అభిప్రాయాలకు లొంగకుండా, వర్తమానంలో ధర్మాన్ని ఆచరించడమే నిజమైన జీవిత నిబంధనగా ముందుకు సాగాలి.
News November 15, 2025
తూ.గో: సదరం క్యాంపులు ప్రారంభం

తూ.గో జిల్లా వ్యాప్తంగా కొత్త సదరం సర్టిఫికెట్ల జారీ కోసం స్లాట్ బుకింగ్ శుక్రవారం నుంచి ప్రారంభమైందని DCHS డా.ఎం.పద్మ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, ప్రతి మంగళవారం ఏరియా హాస్పిటళ్లు, జిల్లా ఆసుపత్రులు, GGHల్లో సదరం సర్టిఫికెట్ల కోసం స్క్రీనింగ్ పరీక్షలు చేస్తామని చెప్పారు.


