News January 25, 2025

సైబర్ నేరాలపై అవగాహన అవసరం: పార్వతీపురం ఎస్పీ

image

ఐటీ, సైబర్ సెక్యూరిటీలపై యువతకు అవగాహన అవసరమని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. జిల్లా వాసులు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. OLX, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, కేవైసీ అప్‌డేట్ చేయాలంటూ వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దని కోరారు. సైబర్ నేరాలకు గురైతే నంబర్ 1930ని సంప్రదించాలన్నారు.

Similar News

News November 8, 2025

పిట్లం: బువ్వ విలువ తెలిసిన అవ్వ..!

image

వరి కోతలు చివరి దశకు చేరుకోవడంతో, రైతులు కోసిన ధాన్యాన్ని రోడ్లపై రాశులుగా ఆరబెట్టారు. ఈ ధాన్యం ఎండిన తరువాత రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో, బువ్వ విలువ తెలిసిన కొందరు వృద్ధ మహిళలు రోడ్లపై పడివున్న ధాన్యపు గింజలను వృథా చేయకుండా సేకరించారు. రాళ్లు లేకుండా శుభ్రం చేసి జాగ్రత్తగా సంచుల్లో నింపుకున్నారు. పిట్లం జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై శనివారం కనిపించిన దృశ్యమిది.

News November 8, 2025

అంతర్ జిల్లా దొంగల ముఠా పట్టివేత: కామారెడ్డి SP

image

KMR జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాలోని 5 గురుని పోలీసులు పట్టుకున్నారు. దేవునిపల్లిలో (కారు, విడి భాగాలు చోరీ), కామారెడ్డి, సదాశివనగర్, భిక్కనూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 15 దొంగతనాలు (బంగారం, వెండి, నగదు, బైక్‌లు చోరీ) ఒప్పుకున్నట్లు SP రాజేష్ చంద్ర పేర్కొన్నారు. NZB, నిర్మల్ జిల్లాల్లోనూ నేరాలకు పాల్పడ్డట్లు శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

News November 8, 2025

VZM: ఈనెల 12న YSRCP ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు

image

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12న జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నామని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ చేపట్టామని ప్రజల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. గత 17 నెలల్లో ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని, మెడికల్ కాలేజీకి మాత్రం నిధులు కేటాయించలేకపోతోందని ప్రశ్నించారు.