News March 18, 2024

బెల్లంపల్లి: పెళ్లి కావడం లేదని యువతి ఆత్మహత్య

image

పెళ్లి కావడం లేదనే మనోవ్యధతో ఓ యువతి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని టేకుల బస్తీకి చెందిన కొత్తూరు సుమలత ఆదివారం కన్నాల రైల్వేగేట్ వద్ద గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లీడు దాటి పోతున్నా వివాహం కావడం లేదనే బాధతో ఆత్మహత్య చేసుకుందని జీఆర్పీ పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 4, 2026

ఆదిలాబాద్: చెక్‌పోస్ట్‌లో రూ.28 లక్షల నగదు లభ్యం

image

ఆదిలాబాద్ శివారు రాంపూర్ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. మున్సిపల్ ఎన్నికల నిబంధనల నేపథ్యంలో మహారాష్ట్ర బస్సులో ప్రయాణిస్తున్న సుభాష్ కేశవ్ అనే వ్యక్తి వద్ద సరైన పత్రాలు లేని 28 లక్షల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రెవెన్యూ, పోలీస్ సిబ్బంది 24 గంటల పాటు నిరంతరంగా ఈ నిఘా కొనసాగిస్తున్నారు.

News February 4, 2026

ఆదిలాబాద్: 9 సార్లు ఎన్నికలు.. ఒకరే మహిళ ఛైర్‌పర్సన్

image

ADB మున్సిపాలిటీ చరిత్రలో ఏకైక ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన రంగినేని మనీషా మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1952లో ఏర్పాటైన పురపాలక సంఘానికి 2014లో ఆమె సారథ్యం వహించారు. గత ఎన్నికల్లో టికెట్ దక్కక దూరమైనా, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ‘ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్’ తరఫున బరిలోకి దిగుతున్నారు. 48వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న ఆమె, తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు.

News February 4, 2026

ఆదిలాబాద్ జిల్లాలో ఐదు చెక్ పోస్టులు: ఎస్పీ

image

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను ఎస్పీ అఖిల్ మహాజన్ తనిఖీ చేశారు. అక్రమ మద్యం, నగదు, బహుమతులు తరలకుండా కఠినంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఐదు ఎస్‌ఎస్‌టి చెక్ పోస్టులలో 24 గంటలు వాహనాల తనిఖీ జరుగుతుందని, రూ.50 వేలకుపైగా నగదు ఉంటే సరైన పత్రాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు స్వామి, ఫనిధర్ ఎస్ఐ విష్ణువర్ధన్ పాల్గొన్నారు.