News January 25, 2025

BREAKING: VSR రాజీనామా

image

AP: వైసీపీ కీలక నేత, జగన్ సన్నిహితుడు విజయసాయి రెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఢిల్లీలో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. కాగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నిన్న VSR ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈయన పదవీకాలం 2028 వరకు ఉంది.

Similar News

News November 11, 2025

వైద్యుల నిర్లక్ష్యం.. వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు

image

TG: నార్కట్‌పల్లిలో ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్యంతో మహిళ మరణించిన కేసులో నల్గొండ జిల్లా వినియోగదారులు ఫోరం సంచలన తీర్పు ఇచ్చింది. బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. నెలలోగా డబ్బు చెల్లించకపోతే 9% వడ్డీతో చెల్లించాలని పేర్కొంది. ఆరెగూడెంకు చెందిన స్వాతి డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరగా వైద్యం వికటించి మరణించింది. దీనిపై బాధిత కుటుంబసభ్యులు ఫోరంను ఆశ్రయించారు.

News November 11, 2025

నవంబర్ 11: చరిత్రలో ఈరోజు

image

1888: స్వాతంత్ర్య సమర యోధుడు, భారత తొలి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జననం (ఫొటోలో)
1917: సినీ దర్శకుడు, నిర్మాత బి.ఎస్.రంగా జననం
1970: రచయిత, పద్మభూషణ్ పురస్కార గ్రహీత మాడపాటి హనుమంతరావు మరణం
1974: హాస్య నటుడు తిక్కవరపు వెంకట‌రమణారెడ్డి మరణం
1994: భారత క్రికెటర్ సంజూ శాంసన్ జననం
2023: నటుడు చంద్రమోహన్ మరణం
* జాతీయ విద్యా దినోత్సవం

News November 11, 2025

VER అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి: చంద్రబాబు

image

AP: శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు విశాఖ ఎకానమిక్ రీజియన్(VER) అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం అవసరమైన పాలసీలను రూపొందించాలన్నారు. క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి ప్రాజెక్టులపై దృష్టి సారించాలన్నారు. స్టేట్ హెల్త్ కేర్ పాలసీతో మెడికల్ టూరిజంను లింక్ చేయాలని సీఎం తెలిపారు.