News January 25, 2025
నరసరావుపేట: బాలికల వసతి గృహంలో అధికారుల విచారణ

నరసరావుపేట ఎస్సీ కళాశాల బాలికలహాస్టల్ లో విద్యార్థిని గర్భం దాల్చి, రక్తస్రావంతో వైద్యశాలలో చికిత్స పొందుతున్న వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ కుమిదిని, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శివనాగేశ్వరరావు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జోత్స్న హాస్టల్లో విచారణ చేపట్టారు. చదువుకుంటున్న విద్యార్థిని (16) ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
Similar News
News April 20, 2026
హార్ముజ్‌లో భద్రత ఫ్రీగా రాదు: ఇరాన్

USతో మళ్లీ ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ ఇంధన భద్రత ఉచితంగా రాదని, కొంత మూల్యం చెల్లించాల్సిందేనని పేర్కొంది. ఓవైపు ఇరాన్ ఆయిల్ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ మరోవైపు ఇతరులకు మాత్రం హార్ముజ్‌లో ఫ్రీగా భద్రత కావాలనుకోవడం కుదరదని ఆ దేశ విదేశాంగ మంత్రి అరాఘ్చీ స్పష్టం చేశారు. ఇరాన్ దాని మిత్రపక్షాలపై ఉన్న ఒత్తిడికి ముగింపు పలికితేనే చమురు ధరలు స్థిరంగా ఉంటాయన్నారు.
News April 20, 2026
NLG: నేటి నుంచి ‘ఓపెన్’ పరీక్షలు

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 44 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. టెన్త్, ఇంటర్ విద్యార్ధులు కలిపి 8,835 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థుల కోసం అన్ని కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు
News April 20, 2026
అనంతగిరి ఏకో టూరిజం ప్రారంభించనున్న స్పీకర్

ప్రకృతి ఒడిలో పరవశించే అనంతగిరి పర్యాటక వైభవం నేడు సరికొత్త కాంతులతో వికసించనుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు ఈ పర్యాటక రంగాన్ని ప్రారంభించి వికారాబాద్ కీర్తి కిరీటంలో మరో మణిహారాన్ని చేర్చనున్నారు. ఈ కార్యక్రమానికి అటవీ శాఖ చార్మినార్ జోన్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీస్, కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహమేరా హాజరవుతారని వికారాబాద్ BFO జ్ఞానేశ్వర్ తెలిపారు. VKB అభివృద్ధికి ఇది కీలకం కానుంది.


