News January 25, 2025

26 నుంచి హోంమంత్రి దుబాయ్ పర్యటన

image

AP: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ నెల 26 నుంచి 31 వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. దుబాయ్, అబుదాబీలో వ్యక్తిగతంగా పర్యటించడానికి ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరగా, ఆ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పర్యటనను ఆమె సొంత నిధులతో చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Similar News

News November 8, 2025

ఫేక్ న్యూస్‌పై తుమ్మల ఆగ్రహం.. పోలీసులకు ఫిర్యాదు

image

ఖమ్మం: తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాగంటి సునీతను గెలిపించాలని కమ్మ సంఘాలకు తాను చెప్పినట్లు వచ్చిన ఫేక్ కథనాన్ని ఆయన ఖండించారు. తన వ్యక్తిత్వాన్ని బదనాం చేసేలా వార్త ప్రచురించిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది BRS దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శిస్తూ, తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

News November 8, 2025

‘కృష్ణ పక్షం’ అంటే ఏంటి?

image

క్యాలెండర్‌లో కొన్ని తిథుల ముందుండే కృష్ణ పక్షం అంటే ఏంటో తెలుసుకుందాం. కృష్ణ పక్షం అంటే.. ప్రతి నెలా పౌర్ణమి తర్వాత, అమావాస్య వరకు ఉండే 15 రోజుల కాలం. ఈ పక్షంలో చంద్రుడి వెన్నెల క్రమంగా తగ్గుతుంది. చంద్రుడు అలా క్షీణిస్తూ పోతాడు కాబట్టి దీన్ని క్షీణ చంద్ర పక్షమని, చీకటి పక్షమని కూడా అంటారు. చీకటి, నలుపును సూచించే ‘కృష్ణ’ను జోడించి కృష్ణ పక్షం అనే పేరొచ్చింది. బహుళ పక్షం అని కూడా వ్యవహరిస్తారు.

News November 8, 2025

ఎయిమ్స్ బిలాస్‌పుర్‌లో 64 ఉద్యోగాలు

image

ఎయిమ్స్ బిలాస్‌పుర్‌ 64 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 12వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎమ్మెస్సీ, ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, ఎంసీహెచ్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.1,180, SC,STలకు రూ.500. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.aiimsbilaspur.edu.in