News January 25, 2025

కామారెడ్డి: థర్మకోల్‌తో అయోధ్య రామాలయం

image

కామారెడ్డి జిల్లా కృష్ణాజివాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కుమ్మరి అక్షర తర్మకోల్‌తో కట్టిన అయోధ్య రామాలయం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల నిర్మించిన అయోధ్య రామాలయంలా తర్మకోల్‌తో నమూనా అయోధ్య రామాలయాన్ని నిర్మించి అందరి చూపరులను ఆకర్షించింది. ఆమె చేసిన నమూనా అయోధ్య రామాలయాన్ని చూసిన వారంతా మంత్ర ముగ్ధులు అవుతున్నారు.

Similar News

News November 15, 2025

స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి?

image

స్త్రీలు గాజులు ధరించడం సాంప్రదాయమే కాదు. శాస్త్రీయంగా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గాజులు మణికట్టుపై నిరంతరం రాపిడి కలిగిస్తాయి. దీంతో ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ స్థాయి పెరుగుతుంది. గాజుల గుండ్రటి ఆకారం శక్తిని శరీరం నుంచి వెళ్లకుండా అడ్డుకుని, తిరిగి మనకే పంపుతుంది. ముఖ్యంగా స్త్రీలకు మణికట్టు వద్ద శక్తిని నిలిపి ఉంచడానికి గాజులు రక్షా కవచంగా పనిచేస్తాయి. ఇది శారీరక సమతుల్యతను కాపాడుతుంది.

News November 15, 2025

తూప్రాన్: మహిళ ఆత్మహత్య

image

తూప్రాన్ పట్టణంలో మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పట్టణానికి చెందిన బుట్టి అమృత (52) మానసిక స్థితి సరిగా లేక ఈనెల 12న క్రిమిసంహారక మందు తాగింది. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News November 15, 2025

iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

image

iBomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. నిన్న ఫ్రాన్స్ నుంచి వచ్చిన అతడిని హైదరాబాద్ కూకట్‌పల్లిలో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి కరీబియన్ దీవుల్లో ఉంటూ ‘ఐబొమ్మ’ను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అతడి అకౌంట్లోని రూ.3 కోట్లను ఫ్రీజ్ చేశారు. సినిమాలను విడుదలైన రోజే పైరసీ చేసి వెబ్‌సైట్‌లో పెట్టడంపై నిర్మాతలు పలుమార్లు iBommaపై కంప్లైంట్లు ఇచ్చారు.