News March 18, 2024

బెట్టింగ్ యాప్ కుంభకోణం.. మాజీ సీఎంపై కేసు

image

ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్‌పై కేసు నమోదైంది. మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణంపై ఈడీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ఆర్థికనేరాల విభాగం కేసు నమోదు చేసింది. యాప్ ప్రమోటర్లు బఘేల్‌కు రూ.508 కోట్ల మేర ఇచ్చినట్లు గతంలో ఆరోపించిన ఈడీ.. ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఎన్నికల నేపథ్యంలో ఇది బీజేపీ నమోదు చేసిన రాజకీయ వేధింపు కేసు అని బఘేల్ ఆరోపించారు.

Similar News

News January 7, 2025

సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలు.. వారం రోజులే గడువు

image

దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరో క్లాస్‌కు అభ్యర్థుల వయసు మార్చి 31, 2025 నాటికి 10-12ఏళ్లు, 9వ క్లాస్‌కు 13-15ఏళ్లు ఉండాలి. హాల్ టికెట్స్ డౌన్‌లోడ్‌, ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీలను తర్వాత ప్రకటిస్తారు. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఎగ్జామ్ ఉంటుంది. పరీక్ష విధానం, సిలబస్ కోసం <>ఇక్కడ క్లిక్<<>> చేయండి.
సైట్: https://exams.nta.ac.in/AISSEE/

News January 7, 2025

నేడు ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన

image

కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఆ వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. మరోవైపు అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి.

News January 7, 2025

చైనా మాంజా అమ్మితే రూ.లక్ష వరకూ ఫైన్!

image

TG: సంక్రాంతికి గాలి పటాలు ఎగురవేసేందుకు కాటన్ దారాలను మాత్రమే వాడాలని అధికారులు సూచించారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే 040-23231440, 18004255364 టోల్ ఫ్రీ నంబర్లలో ఫిర్యాదు చేయాలన్నారు. చైనా మాంజా అమ్మినా, నిల్వ చేసినా ఐదేళ్ల జైలు శిక్ష, ₹లక్ష వరకూ ఫైన్, మనుషులు, పక్షులకు హాని జరిగితే 3-5 ఏళ్ల జైలు, ₹10వేల జరిమానా ఉంటుందన్నారు. NGT ఆదేశాలతో TGలో చైనా మాంజా వాడటాన్ని నిషేధించామన్నారు.