News January 25, 2025

దామోదర్ క్షేమంగానే ఉన్నాడు: మావోయిస్టు పార్టీ లేఖ

image

ములుగు జిల్లా కాల్వపల్లికి చెందిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు@ దామోదర్ క్షేమంగా ఉన్నట్లు ఆ పార్టీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో సోంబే పేరుతో మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. ఈ నెల 16న 8 వేలమంది పోలీసు బలగాలతో బీజాపూర్ జిల్లాలోని పలు గ్రామాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మంది కార్మికులు చనిపోయారన్నారు. కాగా పోలీసులు తప్పుడు ప్రకటన చేశారని, దామోదర్ క్షేమంగానే ఉన్నాడని తెలిపారు.

Similar News

News November 11, 2025

రాష్ట్ర ఉత్సవంగా జగన్న తోట ప్రబల తీర్థం..!

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో జగ్గన్న తోట ప్రభలతీర్థానికి ఎంతో పేరుంది. కనుమ రోజు 11 గ్రామాల నుంచి ఊరేగింపుగా ప్రభలు తీసుకొస్తారు. ఈ అపురూపమైన దృశ్యాలను చూడటానికి వేలాది మంది వస్తారు. దీంతో ప్రబల తీర్థాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించాలనే డిమాండ్ ఉంది. ఇదే విషయమై CM చంద్రబాబును టీడీపీ నాయకురాలు తేజస్వి పొడపాటి కలిసి వినతిపత్రం ఇచ్చారు. త్వరలోనే అధికారికంగా శుభవార్త వస్తాదని ఆమె చెప్పారు.

News November 11, 2025

సదరమ్ సర్టిఫికెట్ల మంజూరుకు రూ.2 కోట్ల వసూళ్లు?

image

జిల్లాలో దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేసే విభాగంలో భారీ అవినీతి జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైకల్య శాతాన్ని పెంచేందుకు ఒక్కో లబ్ధిదారు నుంచి రూ.20-40 వేల వరకు వసూలు చేసినట్లు చెబుతున్నారు. నలుగురు ఉద్యోగులు బృందంగా ఈ అక్రమాలకు పాల్పడినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ ఉద్యోగులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. దివ్యాంగుల నుంచి వసూళ్లకు పాల్పడటమేంటని జిల్లా వాసులు మండిపడుతున్నారు.

News November 11, 2025

NGKL: ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రమేష్ ఎన్నిక

image

నాగర్‌కర్నూల్ మండలం గుడిపల్లి ZPHSలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న K.రమేష్, స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, డీఏలు వెంటనే విడుదల చేయాలని, పీఆర్‌సీ అమలు చేయాలని కోరారు. అలాగే, సీపీఎస్ రద్దు చేసి, రిటైర్డ్ ఉపాధ్యాయుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన ఎన్నికను జిల్లా సంఘం నేతలు హర్షించారు.