News January 25, 2025
HYD: WOW.. పట్టణం మధ్యలో పచ్చదనం..!

మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో పట్టణం మధ్యలో 120 ఎకరాల్లో పచ్చని అద్భుతమైన శాంతివనం పార్క్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇంత పెద్ద పట్టణానికి ఈ పచ్చని పార్క్ ఒక వరంగా పర్యావరణ ప్రేమికులు అభివర్ణిస్తున్నారు. వాకింగ్ ట్రాక్, క్రీడా ప్రాంగణం, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ ఏరియా ఇలా ఎన్నో సదుపాయాలు పార్క్ సొంతం. పల్లెటూరి వాతావరణం ఆస్వాదించి, ఆరోగ్యం పొందేందుకు ఇదొక చక్కటి ప్రాంతం. మంత్లీ పాస్ కూడా ఉంది.
Similar News
News December 25, 2025
విద్యార్థుల తల్లిదండ్రులకు లెటర్ రాసిన హరీశ్‌రావు

సిద్దిపేట MLA హరీశ్ రావు పదవతరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు ఉత్తరం రాశారు. మార్చ్‌లో పరీక్షలు ఉన్నాయని, వచ్చే మూడునెలలు TV, ఫోన్‌లను దూరంగా ఉంచాలన్నారు. సినిమాలు, వినోదాలు, ఫంక్షన్‌లకు వెళ్లకుండా చూడాలని చెప్పారు. సిద్దిపేట అన్నింట్లో ఆదర్శంగా ఉందని, మరోమారు పదవతరగతి ఫలితాల్లో మొదటి స్థానంలో నిలపాలని కోరారు. కృషి ఉంటే లక్ష్యసాధన కష్టం కాదని విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తున్నారు.
News December 25, 2025
రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు: డీకే అరుణ

గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని ఎంపీ డికే అరుణ అన్నారు. బుధవారం నారాయణపేటలో నిర్వహించిన నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో గెలుపొందిన బీజేపీ సర్పంచ్ లను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వడం లేదని అన్నారు.
News December 25, 2025
ప్రెగ్నెన్సీలో కింద కూర్చొంటున్నారా?

గర్భం ధరించిన తర్వాత మహిళల శరీరంలో ఎన్నో మార్పులొస్తాయి. ఆ మార్పులను గమనించుకుని తగిన విధంగా జాగ్రత్తలు పాటించాలి. ప్రెగ్నెన్సీలో కింద కూర్చోవాలి అనుకుంటే గర్భాశయం మీద ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. బాసింపట్టు వేసుకుని కూర్చునే అలవాటు లేని వాళ్ళు ప్రెగ్నెన్సీ టైమ్ లోప్రయత్నించవద్దు. ఎవరైతే నడుము నొప్పితో బాధపడే ప్రెగ్నెన్సీ మహిళలు ఉంటారో వాళ్ళు బాసింపట్లు వేసుకుని కూర్చోకూడదని నిపుణులు చెబుతున్నారు.


