News January 25, 2025
పుష్కరాల పనులు పూర్తి చేయాలి: BHPL కలెక్టర్

ఏప్రిల్ 30 వరకు సరస్వతి పుష్కారాల పనులన్నీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయంలో సరస్వతి పుష్కారాలు, ఫిబ్రవరిలో నిర్వహించనున్న కుంభాభిషేకం కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని పనులను సమర్థవంతంగా పూర్తి చేయడం ద్వారా పుష్కారాలకు వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News February 28, 2026
ఇంటర్ పరీక్షల్లో పొరపాట్లకు తావుండొద్దు: కలెక్టర్

గద్వాల జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్, బాలికల కళాశాలల్లోని పరీక్షా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిట్టింగ్ ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, ఫ్లయింగ్ స్క్వాడ్ పర్యవేక్షణను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు.
News February 28, 2026
NRPT: మొబైల్ యాప్ వినియోగంపై శిక్షణ

మీసేవ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు మొబైల్ యాప్‌ను విధిగా వినియోగించాలని నారాయణపేట అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, జీపీఓలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ యాప్ వినియోగంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలనను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
News February 28, 2026
బాపట్లలో పింఛన్ పంపిణీ చేసిన కలెక్టర్

బాపట్ల మున్సిపాలిటీలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పెన్షన్లు సమయానికి, పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో, తహశీల్దార్ ఉన్నారు.


