News January 25, 2025
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: సీపీ

విద్యార్థులు తమ తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకొని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల వినియోగంతో జీవితం అంధకారం అవుతుందని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా విద్యార్థులకు తెలిపారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా కాజీపేట నిట్ కళాశాలలో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
Similar News
News January 22, 2026
ఎస్.జానకి కుమారుడు కన్నుమూత

లెజెండరీ సింగర్ ఎస్.జానకి కుమారుడు మురళీ కృష్ణ(65) కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రముఖ గాయని చిత్ర వెల్లడించారు. మురళీ మరణ వార్త షాక్‌కు గురి చేసిందని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న మురళీకృష్ణ పలు సినిమాల్లోనూ నటించారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
News January 22, 2026
నెల్లూరు మీదుగా మరో ప్రతిష్ఠాత్మక రైలు.!

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా హైదరాబాద్ (చర్లపల్లి)-తిరువనంతపురం నార్త్ మధ్య కొత్త అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రవేశపెట్టబోతోంది. ఈ రైలు నెల్లూరు మీదుగా వెళ్లనుంది. నెల్లూరుకు ఉదయం 5:43కు రానున్న ఈ రైలు 5.45AMకు బయలుదేరి 4:30 PMకు చర్లపల్లి చేరుకోనుంది. ఉదయాన్నే నెల్లూరు నుంచి HYD వెళ్లాలనుకునే వారికి ఈ రైలు ఉపయోగపడనుంది.
News January 22, 2026
మార్కెట్ విలువ పెంపు.. రియల్ బూమ్, ఆదాయమే టార్గెట్!

AP: రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడం, ఆదాయం పెంచుకోవడమే టార్గెట్‌గా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భూముల <<18911969>>మార్కెట్ విలువ<<>> పెంచాలని నిర్ణయించింది. గతేడాది ఫిబ్రవరి 1వ తేదీన పెంచిన విలువతో దాదాపు 9 నెలల్లోనే రూ.7వేల కోట్లు ఆర్జించింది. ఈసారి కూడా అదే స్ట్రాటజీతో ముందుకు సాగుతోంది. 7-8 శాతం వరకు పెంపు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రతి సంవత్సరం మార్కెట్ విలువ పెంచే అవకాశం ఉంది.


