News January 25, 2025
అన్నమయ్య జిల్లాలో షాపులు వీరికే!

అన్నమయ్య జిల్లాలో కల్లు, గీత కార్మికులకు కలెక్టర్ చామకూరి శ్రీధర్ షాపులు కేటాయించారు. పీలేరు మండలంలో-గౌండ్ల, బి.కొత్తకోటరూరల్-గౌడ్, మదనపల్లె మున్సిపాలిటీ -ఈడిగ, రాజంపేట మున్సిపాలిటీ -ఈడిగ, తంబళ్లపల్లె మండలం -ఈడిగ, రామసముద్రం మండలం -ఈడిగ, నిమ్మనపల్లి మండలం -ఈడిగ, కలకడ మండలం -ఈడిగ, వీరబల్లి మండలం -ఈడిగ, నందలూరు మండలం -గౌడ, రాయచోటి మున్సిపాలిటీ- గౌడ్ లకు కేటాయించారు.
Similar News
News July 9, 2025
సిరిసిల్ల: కస్తుర్భా విద్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్

బోయినపల్లిలోని కస్తుర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈరోజు పరిశీలించారు. పదో తరగతి గదిని సందర్శించి, విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. కిచెన్, స్టోర్ రూమ్, మధ్యాహ్న భోజనం తయారీ తీరును పరిశీలించారు. విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు.
News July 9, 2025
పెద్దపల్లి: సమ్మె చేస్తుండగా కార్మికుడి మృతి

పెద్దపల్లి జిల్లా ధర్మారంలో బుధవారం జరిగిన కార్మికుల సమ్మెలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కార్మికులు ర్యాలీ చేపట్టిన అనంతరం వినతి పత్రం ఇచ్చేందుకు తహశీల్దార్ ఆఫీస్‌కు వెళ్లారు. అదే సమయంలో దొంగతుర్తికి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం మండలాధ్యక్షుడు ఆకుల రాజయ్యకు గుండెపోటు వచ్చింది. తోటి కార్మికులు CPR చేసి అతడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందారు.
News July 9, 2025
మోసపోయిన యువకులకు లోకేశ్ సాయం

AP: ఏజెంట్ల మాయమాటలు నమ్మి IT, డిజిటల్ జాబ్స్ కోసం థాయిలాండ్‌కు వెళ్లి పలువురు యువకులు దోపిడీకి గురవుతున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. వారిని సేఫ్‌గా ఇండియాకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జాబ్ ఆఫర్స్ వెరిఫై చేసుకునేందుకు, ఎమర్జెన్సీ సమయంలో +91-863-2340678, వాట్సాప్: 8500027678 నంబర్లను సంప్రదించాలని సూచించారు.