News March 18, 2024
మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించేందుకు గవర్నర్ నిరాకరణ
తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ రవి మధ్య వివాదం కొనసాగుతోంది. DMK నేత పొన్ముడిని మంత్రిగా నియమించాలంటూ CM స్టాలిన్ చేసిన సిఫార్సును గవర్నర్ తిరస్కరించారు. అవినీతి కేసులో పొన్ముడికి హైకోర్టు విధించిన మూడేళ్ల శిక్షపై సుప్రీం స్టే విధించడంతో ఆయన సభ్యత్వాన్ని స్పీకర్ పునరుద్ధరించారు. దీంతో పొన్ముడితో మంత్రిగా ప్రమాణం చేయించాలంటూ CM లేఖ రాయగా, కేసును కొట్టేయనందున తిరస్కరిస్తున్నట్లు రవి స్పష్టం చేశారు.
Similar News
News January 6, 2025
ఈనెల 25లోపు రెండో విడత కాటమయ్య కిట్లు: మంత్రి
TG: కల్లు గీత కార్మికులకు రెండో విడతలో భాగంగా 10 వేల కాటమయ్య రక్షణ కవచం కిట్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈనెల 25లోపు పంపిణీ పూర్తి చేస్తామన్నారు. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మందికి కిట్లు ఇచ్చామని తెలిపారు. గత ఏడాది జులై 14న రంగారెడ్డి (D) లష్కర్ గూడలో సీఎం రేవంత్ కాటమయ్య కిట్ల పంపిణీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
News January 6, 2025
GOOD NEWS చెప్పిన ప్రభుత్వం
TG: ఈ నెల 26 నుంచి ప్రభుత్వం రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేయనుంది. అయితే ఇందుకోసం రైతులు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సాగుకు యోగ్యం కాని భూములపై సర్వే చేసి 10 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. దీని ప్రకారం వ్యవసాయం చేసే భూములకే డబ్బులు అందనున్నాయి. ఈ స్కీం కింద ఏడాదికి ఎకరానికి రూ.12వేలు అందుతాయి.
News January 6, 2025
రైతు భరోసా: బీడు భూములు గుర్తించేందుకు సర్వే!
TG: వ్యవసాయ భూములకే రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, సాగు యోగ్యం కాని భూములను గుర్తించేందుకు జాయింట్ సర్వే నిర్వహించనుంది. వ్యవసాయ, పంచాయతీ రాజ్, రెవెన్యూ ఆధ్వర్యంలో ఫీల్డ్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు సమాచారం. సర్వే నంబర్ల వారీగా గుట్టలు, వెంచర్ల లిస్ట్ రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది. వర్షాకాలం సాగు లెక్కలను ప్రామాణికంగా తీసుకుని పథకానికి కావాల్సిన నిధులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.