News January 25, 2025
ఊరించడమే కాంగ్రెసోళ్ల పని: కుత్బుల్లాపూర్ MLA

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలుపై BRS కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శలు గుప్పించారు. నేడు, రేపు, మాపు అంటూ ఊరించడమే కాంగ్రెసోళ్ల పని అని, రేషన్ కార్డులు ఇదిగో ఇస్తాం..! అదిగో ఇస్తాం..! అంటూ ఊరిస్తున్నారే తప్ప, అర్హులకు అందించడం లేదన్నారు. పేదలకు పథకాలు అందకపోతే, కుత్బుల్లాపూర్ నుంచి ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఎన్ని సార్లు దరఖాస్తులు తీసుకుంటారని ప్రశ్నించారు.
Similar News
News November 9, 2025
తల్లి క్షణికావేశం.. పిల్లల పాలిట యమపాశమై.!

ఓ తల్లి క్షణికావేశం ఇద్దరు పిల్లల పాలిట <<18236870 >>మృత్యుపాశ<<>>మైంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన మాతృమూర్తే తనతోపాటూ బిడ్డలను కాటికి తీసుకెళ్లింది. సూళ్లూరుపేట(M)లో వరలక్ష్మి(24) పిల్లలోసహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు మాధవయ్యతో ఆరేళ్ల క్రితం వివాహం అయింది. కొన్నేళ్లుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల భర్త వరలక్ష్మిని మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది.
News November 9, 2025
తల్లి క్షణికావేశం.. పిల్లల పాలిట యమపాశమై.!

ఓ తల్లి క్షణికావేశం ఇద్దరు పిల్లల పాలిట <<18236870>>మృత్యుపాశ<<>>మైంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన మాతృమూర్తే తనతోపాటూ బిడ్డలను కాటికి తీసుకెళ్లింది. సూళ్లూరుపేట(M)లో వరలక్ష్మి(24) పిల్లలోసహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు మాధవయ్యతో ఆరేళ్ల క్రితం వివాహం అయింది. కొన్నేళ్లుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల భర్త వరలక్ష్మిని మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది.
News November 9, 2025
విధ్వంసం.. 13 బంతుల్లో 54 రన్స్

హాంకాంగ్ సిక్సెస్-2025లో ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. తాజాగా సౌతాఫ్రికాతో మ్యాచులో బంగ్లా ఓపెనర్ హబీబుర్ రెహ్మాన్ ఊచకోత కోశారు. 13 బంతుల్లోనే 54 రన్స్ చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. ఆయన ఏకంగా 8 సిక్సర్లు, ఒక ఫోర్ బాదారు. అంటే బౌండరీల ద్వారానే 52 రన్స్ రాబట్టారు. మరో ప్లేయర్ హొస్సైన్ 8 బంతుల్లో 27 రన్స్ చేయడంతో BAN 6 ఓవర్లలో 128 పరుగులు చేసింది. SA 25 రన్స్ తేడాతో ఓడిపోయింది.


