News January 25, 2025

NGKL: కుష్ఠు వ్యాధి అవగాహన అవసరం: స్వరాజ్యలక్ష్మి

image

స్పర్శలేని కుష్ఠి వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి అన్నారు. జిల్లా కలెక్టర్ సమావేశ హాల్లో వైద్యాధికారులు, కుష్ఠు వ్యాధి నోడల్ అధికారులు ఈనెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు స్పర్శ లేని కుష్ఠు వ్యాధిపై అవగాహన ఉద్యమం నిర్వహించాలని సూచించారు. ప్రజలు ఈ వ్యాధి (స్పర్శ లేని మచ్చ)పై అవగాహనతో వారే స్వయంగా డాక్టర్ను సంప్రదించాలన్నారు.

Similar News

News September 19, 2025

పాఠశాలల భద్రతకు సహకరించండి: యాదాద్రి డీఈవో

image

దసరా సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల భద్రతకు గ్రామస్థులు సహకరించాలని యాదాద్రి జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. పాఠశాల ఆవరణలలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా హెచ్‌ఎంలు, ఎంఈఓలు, ‘అమ్మ ఆదర్శ కమిటీ’ సభ్యుల సహకారంతో చర్యలు చేపట్టాలని సూచించారు. పాఠశాలలు దేవాలయాలతో సమానమని, వాటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.

News September 19, 2025

భువనగిరిలో ఫుట్‌బాల్ ఎంపిక పోటీలు

image

యాదాద్రి భువనగిరిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో శుక్రవారం అండర్-19 విభాగంలో ఉమ్మడి జిల్లా స్థాయి ఫుట్‌బాల్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలలో నల్గొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాలకు చెందిన జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొనవచ్చని కళాశాల ప్రిన్సిపల్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్న బాల, బాలికలు తమ ఎస్ఎస్‌సీ మెమోతో ఉదయం 8:30 గంటలకు కళాశాలకు చేరుకోవాలని సూచించారు.

News September 19, 2025

ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దు: KMR కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు పూర్తిగా నిండి ఉన్నాయని, వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకూడదని సూచించారు. గ్రామాల్లో, పట్టణాల్లో నీరు నిలవకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.